Aa Okkati Adakku Day 1 Collections: నరేష్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అతడు సరైన విజయాలను సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయినా ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి మొదటి రోజు ఎలాంటి స్పందన లభించింది? దీనికి ఎన్ని కోట్లు వసూళ్లు వచ్చాయి? అనే వివరాలను చూద్దాం పదండి!
మరోసారి కామెడీ సినిమాతో:టాలెంటెడ్ స్టార్ అల్లరి నరేష్ నటించిన లెటెస్ట్ మూవీనే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రలను పోషించారు.

నరేష్ మూవీ బిజినెస్ ఇలా:చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
మిక్స్‌డ్ టాక్‌తో తక్కువగా:క్రేజీ కామెడీతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే మిశ్రమంగా లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే తక్కువ వసూళ్లు వస్తాయని టాక్ వినిపించింది.
తొలి రోజు ఎంత వచ్చింది?:విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి టాక్‌కు అనుగుణంగా అంతగా స్పందన రాదని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 55 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ. 1.10 కోట్లు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:అల్లరి నరేష్ - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 55 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 20 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 75 షేర్‌తో పాటు రూ. 1.62 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు నరేష్ సినిమాకు రూ. 75 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 3.75 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











