Aa Okkati Adakku Business: అల్లరి నరేష్ మూవీకి ఊహించని బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది సినీ వారసులు మాత్రమే తమదైన రీతిలో ప్రేక్షకులను అలరించి స్టార్లుగా మారారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు అల్లరి నరేష్ ఒకడు. మొదట్లో కామెడీ చిత్రాలతో మెప్పించిన అతడు.. ఈ మధ్య కాలంలో ప్రయోగాలు చేస్తోన్నాడు.
కానీ, విజయాలను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతోన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ హిట్ కోసం నరేష్ 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ లెక్కను చూద్దాం పదండి!

క్లాసిక్ టైటిల్‌తో అల్లరి నరేష్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రలు చేశారు.

అలాంటి స్టోరీతో ఫన్నీగానే
పెళ్లి చేసుకునే వయసు వచ్చినా వివాహం చేసుకోని ఓ కుర్రాడి జీవితంలోకి ఎలాంటి కొత్త సమస్యలు వచ్చాయి? అతడు వీటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో తెరకెక్కించిన చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. ఇది ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది.

ప్రమోషన్స్ పూర్తి.. సందడి
అల్లరి నరేష్ హీరోగా చేసిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా నిర్వహించింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండడంతో ఈ మూవీ సందడి బాగా కనిపిస్తోంది.

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్
ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీపై నరేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా ఈ సినిమాకు రూ. 3.50 కోట్లు, ఓవరాల్‌గా రూ. 4.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు అతడి కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 4.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 5.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే ఆ ఒక్కటీ అడక్కు సినిమా విజయం సాధిస్తుంది. ఆరంభంలో మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











