Ugram Bussiness: అల్లరి నరేష్ సినిమాకు ఊహించని బడ్జెట్.. ఉగ్రం ఓవరాల్ బిజినెస్ ఎంతంటే?

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉగ్రం. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. నాంది తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో కాస్తా హైప్ ఉంది. అలాగే మొదటి సారిగా అల్లరి నరేష్ కమర్షియల్ హీరో రేంజ్ లో కంప్లీట్ మాస్ యాక్షన్ సింబాలిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీతో మీర్నా మీనన్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెడుతోంది. ఇక ఈ సినిమాకు కాస్త బడ్జెట్ ఎక్కువే అయినట్లు తెలుస్తోంది. అలాగే నాంది కాంబినేషన్ కాబట్టి మార్కెట్ లో డిమాండ్ గట్టిగానే పెరిగింది. ఇక ఓవరాల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

Allari naresh ugram movie budget and business details

మరోసారి అతనితోనే: వరుస అపజయాలతో సతమతమవుతున్న అల్లరి నరేష్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత నాంది అనే సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ అదే తరహాలో డిఫరెంట్ గా సక్సెస్ కొట్టాలని చూసినప్పటికీ మళ్లీ అపజయాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన మారేడుమిల్లి నియోజకవర్గం అనే సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు నాంది సినిమాతో సక్సెస్ ఇచ్చిన విజయ్ తోనే అతను మరోసారి చేతులు కలిపాడు.

బడ్జెట్ ఎంతంటే?: ఇదిలా ఉంటే కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఇటీవల కాలంలో అల్లరి నరేష్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమాకి అయ్యిందంట. ఏకంగా మూవీ కోసం 15 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల మాట. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం నరేష్ కి ఉన్న మార్కెట్ రేంజ్ కి మించి ఉగ్రం మూవీ కోసం బడ్జెట్ ఖర్చు చేశారు.

Allari naresh ugram movie budget and business details

నాన్ థియేట్రికల్ బిజినెస్: ఇక ఈ సినిమా టీజర్ ఆకట్టుకోవడంతో పాటు నాంది లాంటి హిట్ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కుమార్ కనకమేడల కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం కావడంతో మూవీకి మంచి బిజినెస్ జరిగింది. ఈ నేపధ్యంలోనే సినిమా నాన్ థీయాట్రికల్ రైట్స్ ఏకంగా 10 కోట్లకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాంగ్స్, డిజిటల్, శాటిలైట్ కలుపుకొని 10 కోట్ల వరకు ఈ సినిమా నా థీయాట్రికల్ బిజినెస్ చేసిందంట.

థియేట్రికల్ బిజినెస్: ఇక ఈ మూవీ థీయాట్రికల్ బిజినెస్ కూడా డీసెంట్ గానే జరిగింది. అన్ని ఏరియాలు కలుపుకొని ఐదు కోట్ల వరకు ఉగ్రం థీయాట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. బ్రేక్ ఎవెన్ టార్గెట్ తక్కువగా ఉండటంతో కంటెంట్ బాగుంటే వీకెండ్ పూర్తయ్యే లోపే ఈ కలెక్షన్స్ వచ్చేసే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Allari naresh ugram movie budget and business details

ఈసారి సక్సెస్ అందుకుంటాడా?: పోలీస్ ఆఫీసర్, రివేజ్ యాక్షన్ డ్రామా కథలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా హీరోల నుంచి వచ్చినా కూడా అల్లరి నరేష్ కి మాత్రం ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. కామెడీ క్యారెక్టర్స్ లోనే ఎక్కువగా నరేష్ ని రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ నాందితో సీరియస్ పాత్ర చేసిన కనెక్ట్ అయ్యారు. ఈ సారి యాక్షన్ హీరోగా ఉగ్రం మూవీతో మారిపోయాడు. బీభత్సమైన ఫైట్స్ చేశాడు. మరి ఈ క్యారెక్టరైజేషన్ ని ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X