Ugram Collections: పెరిగిన నరేష్ 'ఉగ్రం' కలెక్షన్స్.. హిట్టుకు ఎంత దూరంలో ఉన్నాడంటే?
కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నరేష్ తాజాగా మరోసారి కొత్త సినిమాతో ముందుకు వచ్చాడు. యాక్షన్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నించిన సినిమానే ఉగ్రం. మే 5న విడుదలైన ఈ సినిమాకు టాక్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రం మూడో రోజు వసూళ్లు విషయంలోకి వెళితే..
పాజిటివ్ రెస్పాన్స్:నాంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ మరోసారి నటించిన చిత్రమే ఉగ్రం. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్ హీరోయిన్ గా చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

బడ్జెట్.. థియేటర్ కౌంట్:నరేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఉగ్రం చిత్రానికి సుమారుగా రూ. 15 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నైజాంలో 110, సీడెడ్‌లో 45, ఆంధ్రప్రదేశ్ లో 165 స్క్రీన్లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 320 థియేటర్లలో విడుదల చేశారు. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 45, ఓవర్సీస్‌లో 150 థియేటర్లలతో కలిపి వరల్డ్ వైడ్ గా మొత్తం 515 స్క్రీన్స్ లలో ఉగ్రం రిలీజ్ అయింది.

ప్రీ రిలీజ్ బిజినెస్:అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రంకి తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ అయింది. ఇక కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1 కోటి మార్కెట్ జరిగింది. ఇలా వరల్డ్ వైడ్ గా మొత్తంగా ఉగ్రం సినిమాకు రూ. 5.80 కోట్ల బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదు అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ:ఉగ్రం చిత్రంలో నరేష్ యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశాడని టాక్ వస్తోంది. కొన్ని పాజిటివ్, మరికొన్ని నెగెటివ్ అంశాలతో సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో మూడో రోజు అయిన ఆదివారం థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఉదయం 14.61 శాతం, మధ్యాహ్నం 24.70 శాతం సాయంత్రం 28.48 శాతంగా నమోదు అయింది.

3వ రోజు వసూళ్లు:నరేష్ తన నట ఉగ్రరూపం చూపించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించడంతో అంచనాలు పెరిగాయి. కానీ వసూళ్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. రెండో రోజు రూ. 1.15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాగా.. మూడో రోజు కాస్తా పెరిగి రూ. 1.25 కోట్లు వసూళు అయింది. ఇక 3 రోజుల్లో రూ. 3.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఇంకా రూ. 4.25 కోట్లు వస్తే హిట్ స్టేటస్ అందుకుంటుందని అంచనా.


Click it and Unblock the Notifications











