Ugram Collections: ఉగ్రం సినిమాకు కలిసి రాని పాజిటివ్ టాక్.. షాకింగ్ కలెక్షన్స్.. లాభం రావాలంటే?

నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో సీరియస్ పాత్రల్లో మెప్పించిన అల్లరి నరేష్ ఎక్కువగా హాస్య భరిత సినిమాలతో తెగ పాపులర్ అయ్యాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు ఈవీవీ సత్యనారయణ కుమారుడిగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన నరేష్ కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం ఉగ్రం. విజయ్ కనకమేడలతో నరేష్ రెండోసారి చేసిన ఈ సినిమాకు టాక్ పర్వాలేదనిపించిన కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఉగ్రం 4వ రోజు వసూళ్లలోకి వెళితే..

Allari Naresh Vijay Kanakamedala Ugram Day 4 Expected Worldwide Box Office Collection

కొత్త హీరోయిన్: మిర్నా మీనన్ అనే కొత్త హీరోయిన్ ను తెలుగు వెండితెరకు పరిచయం చేసిన సినిమా ఉగ్రం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. బేబీ ఊహ ఇందులో నరేష్ కు కూతురిగా చిట్టిపొట్టి మాటలతో ఆకట్టుకుంది. మే 5న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంటుంది.

Allari Naresh Vijay Kanakamedala Ugram Day 4 Expected Worldwide Box Office Collection

బడ్జెట్.. బిజినెస్: అల్లరోడిని యాంగ్రీ పోలీస్ గా చూపించిన ఉగ్రం సినిమాకు దాదాపుగా రూ. 15 కోట్ల బడ్జెట్ అయింది. దీనికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. నైజాం రూ. 2.00 కోట్లు, సీడెడ్‌ రూ. 80 లక్షలు, ఆంధ్రా రూ. 2.00 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ అయింది. వరల్డ్ వైడ్ గా మొత్తం రూ. 5.80 కోట్ల బిజినెస్ అవ్వగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా ఫిక్స్ అయింది.

Allari Naresh Vijay Kanakamedala Ugram Day 4 Expected Worldwide Box Office Collection

థియేటర్ ఆక్యుపెన్సీ: ఉగ్రం చిత్రంలో నరేష్ డైలాగ్ డెలీవరి మినహా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడని మంచి టాక్ వస్తోంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ ను రాబట్టడంలో మాత్రం పెద్దగా సక్సెస్ కావట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో నాలుగో రోజు అయిన వర్కింగ్ డేలో థియేటర్ ఆక్యుపెన్సీ ఉదయం 12.59 శాతం, మధ్యాహ్నం 15.29 శాతం సాయంత్రం 12.57 శాతంగా ఉంది. రామబాణం సినిమాతో పోలిస్తే దీనికి మంచి ఆక్యుపెన్సీనే వచ్చినట్లు తెలుస్తోంది.

Allari Naresh Vijay Kanakamedala Ugram Day 4 Expected Worldwide Box Office Collection

4వ రోజు వసూళ్లు: అల్లరి నరేష్ ఉగ్రం సినిమాకు వసూళ్లు నామ మాత్రంగానే ఉంటున్నాయి. దీనికి 4వ రోజున రూ. 75 లక్షలు నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే మొత్తంగా 4 రోజుల్లో రూ. 4.18 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి తొలి రోజున రూ. 1.1 కోట్లు, రెండో రోజు రూ. 1.15, మూడో రోజు రూ. 1.18 నెట్ వసూళ్లు పెరిగాయి. క్రమంగా రోజు పెరుగుతున్న 4వ రోజు మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి.

Allari Naresh Vijay Kanakamedala Ugram Day 4 Expected Worldwide Box Office Collection

లాభం రావాలంటే: అల్లరోడి ఉగ్రం సినిమాకు ఇప్పటికీ నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.88 కోట్ల షేర్, రూ. 3.85 కోట్ల గ్రాస్ వసూలు అయింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 2.10 కోట్ల షేర్, రూ. 4.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజున రూ. 20 నుంచి 30 లక్షల మధ్యలో షేర్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశారు. ఇలా చూసుకుంటే ఇంకా రూ. 4 కోట్లకుపైగా వసూళ్లు వస్తేనే ఉగ్రం సినిమాకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X