twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aamir Khan మూవీ రైట్స్‌ అల్లు అరవింద్ చేతికి.. నాగచైతన్య కోసం ఎంత చెల్లించారంటే?

    |

    అక్కినేని నట వారసుడు నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ఒక సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలెక్కిస్తూ ఎన్నడూ లేని విధంగా కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఏకంగా అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్రను పోషించడం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..

    ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్

    ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్


    లాల్ సింగ్ చద్దా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు, వాయకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా హాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్. ఈ చిత్రంలో టామ్ హంక్స్ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోయారు.

    గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రిలీజ్

    గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రిలీజ్


    కరీనా కపూర్, అమీర్ ఖాన్ మరోసారి జంటగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనర్‌ను నియమించారు. ఈ సినిమాను అమీర్ ప్రాణం పెట్టి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రిలీజ్ కానున్నది.

     భారీ మొత్తానికి తెలుగు రైట్స్

    భారీ మొత్తానికి తెలుగు రైట్స్


    లాల్ సింగ్ చద్దా సినిమాను ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ డబ్బింగ్ మూవీ కోసం అమీర్ ఖాన్‌కు భారీ మొత్తాన్ని చెల్లించినట్టు తెలిసింది. ప్రస్తుతం తెలుగు రైట్స్ మొత్తం గురించి సినీ వర్గాల్లో క్రేజీగా చర్చ జరుగుతున్నది. అయితే నాగచైతన్యకు తెలుగులో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ ఆఫర్‌ను అరవింద్ ఇచ్చినట్టు సమాచారం.

     బాలీవుడ్‌లో తొలి 100 కోట్లు

    బాలీవుడ్‌లో తొలి 100 కోట్లు


    గతంలో అమీర్ ఖాన్‌తో గజనీ హిందీ రీమేక్ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించడం తెలిసిందే. బాలీవుడ్‌కు తొలి 100 కోట్ల మూవీని అందించిన ఘనత అరవింద్‌కే దక్కింది. దేశవ్యాప్తంగా గజనీ చిత్రం అద్బుతమైన విజయాన్ని అందించడమే కాకుండా అమీర్ ఖాన్‌కు భారీ కమర్షియల్ సక్సెస్ అందించడం జరిగింది. వారిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే లాల్ సింగ్ చద్దాను అరవింద్ చేతిలో పెట్టినట్టు సమాచారం.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అద్వైత్ చందన్
    నిర్మాతలు: అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అందారే, రాధికా చౌదరీ
    సినిమాటోగ్రఫి: సత్యజిత్ పాండే
    ఎడిటింగ్: హేమంతి సర్కార్
    మ్యూజిక్: తనుజ్ టిక్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ప్రీతమ్ (సాంగ్స్)
    బ్యానర్స్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
    రిలీజ్ డేట్: 2022-08-11

    English summary
    Geeta arts banner's Chief and popular producer Allu Aravind has been acquired Aamir Khan and Naga Chaitanya's Laal Singh Chaddha Telugu rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X