అల్లు అరవింద్ చేతికి మహేష్ లేటెస్ట్ సినిమా
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. మంచి రేటు ఇచ్చి నైజాం,ఆంధ్రా పంపిణీ హక్కులను సొంతం చేసుకోవటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అల్లు అరవింద్ తమ కుటుంబ సభ్యుల చిత్రాల తప్ప బయిటవి పంపిణీ చేయటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అలాంటిది అల్లు అరవింద్ ఈ చిత్రం తీసుకోవటంతో ఎంతో నమ్మకముంటే తప్ప ఇలా చేయరని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా కలేజా అనుకుంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో గతంలో అతడు చిత్రం వచ్చి ఘన విజయాన్నే నమోదు చేసింది. ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. ఆయన దీనితో పాటు పవన్ కళ్యాణ్ తో పులి చిత్రాన్ని సైతం ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తమన్నా, వరుణ్ సందేశ్ కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తోంది. ఇంతకుముందు ఈ బ్యానర్ పై నిర్మించిన మగధీర రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











