అల్లు అర్జున్ పై అంత పెట్టుబడా?
అల్లు అర్జున్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న బదిరీనాధ్ చిత్రానికి ముఫ్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నట్లు గీతా ఆర్ట్స్ తరుపున అల్లు శిరీష్ చెప్తున్నారు. పిభ్రవరి 2011 లో ప్రారంభమయ్యే ఆ చిత్రం సంచలన విజయం నమేదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాము ప్రస్తుతం తెలుగు మగధీరను బాలీవుడ్ కి తీసుకెళ్తున్నామని ఇంకా స్టార్ కాస్టింగ్ ఫైనలైజ్ చేయలేదని చెప్పారు. అలాగే తమ గీతా ఆర్ట్స్ 24 మందితో కూడిన టీమ్ ని ఏర్పాటు చేసి తమ చిత్రాలు పైరసీ కాకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. అలాగే కొంత మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ని ఎధికల్ హేకర్స్ ని నియమించుకుని తమ సంస్ధ చిత్రాల ఇంటరనెట్ పైరసీని అరికట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అల్లు శిరీష్ తనను కలిసిన మీడియాకు వివరించారు.
allu arjun bunny badhirinadh vv vinayak piracy 35crore అల్లు అర్జున్ బన్నీ బదిరీనాధ్ ముప్పై ఐదు కోట్లు మగధీర గీతా ఆర్ట్స్ అల్లు శిరీష్


Click it and Unblock the Notifications