యష్ రాజ్ పిల్మ్స్ ఆఫర్ నిజమే: అల్లు అర్జున్
అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ ఎంట్రీ పై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..నాకు యష్ ఫిల్మ్ దగ్గర నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను లవర్ బోయ్ అనే కంపర్ట్ జోన్ నుంచి బయిటకు రావాలనుకుంటున్నాను. ఏదో ఒకటి కొత్తగా చేస్తూ బాలీవుడ్ ఎఁట్రీ ఇవ్వాలి. ఏదైనా ప్రయోగాత్మకమైన రోల్ వస్తే నేను టెమ్ట్ అవుతాను అన్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్..వాసు వర్మ దర్శకత్వంలో రూపొందే లవర్ చిత్రం కమిటయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం డివివి దానయ్య తన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టైరేజేషన్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది. మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే


Click it and Unblock the Notifications











