అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇక బాక్సాఫీస్ వద్ద బన్నీ కుమ్ముడే

Recommended Video

Ala Vaikunthapurramuloo Pre Release Business

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో చిత్రం అల వైకుంఠపురములోపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి దిగేందుకు జనవరి 12 థియేటర్లలోకి రాబోతోంది అల వైకుంఠపుములో. ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది యూనిట్. ఈ క్రమంలోనే నేటి సాయంత్రం మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహిస్తోంది.

పాటలతో సెన్సేషన్..

పాటలతో సెన్సేషన్..

అల వైకుంఠపురములో చిత్రంపై ఇంతటి హైప్ ఏర్పడటానికి ముఖ్య కారణం తమన్ సంగీతం. తమన్ అందించిన ఒక్కో పాట సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోయాయి. సామజవరగమన, రాములో రాముల, ఓ మై గాడ్ డ్యాడీ, బుట్టబొమ్మ అంటూ ఇలా తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.

అందుకే లైవ్ కాన్సర్ట్..

అందుకే లైవ్ కాన్సర్ట్..

మామూలుగా అయితే ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అయితే అల వైకుంఠపురములో చిత్రానికి సంగీతమే ప్రధాన బలమైంది కాబట్టి.. ప్రత్యేకంగా, కొత్తగా ఉంటుందని మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమన్, సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి వంటి వారు లైవ్‌లో పర్ఫామ్ చేయబోతోన్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలు..

ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో మూవీ.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇంకెంతటి సంచలనాలు నమోదు చేసి ఉంటుందో ఆలోచించండి. బన్నీ కెరీర్‌లోనే అత్యధికంగా బిజినెస్ చేసిన చిత్రంగా అల రికార్డు సృష్టించినట్టు తెలుస్తోంది. ఏ ఏరియాలో ఎంతకు అమ్ముడు పోయిందో ఓ సారి చూద్దాం.

ఏరియాల వారిగా...

ఏరియాల వారిగా...

నైజాంలో ఈ చిత్రం 20కోట్లు, సీడెడ్‌లో 12కోట్లు, నెల్లూరు 2.8కోట్లు, కృష్ణా 5కోట్లు, గుంటూరు 6.3కోట్లు, వైజాగ్ 8.5కోట్లు, ఈస్ట్ 6.3కోట్లు, వెస్ట్ 5కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 65కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

కర్ణాటకలో 7.2కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.5కోట్లు, ఓవర్సీస్ 9.8కోట్లు.. ఇలా అన్ని లెక్కేసుకుంటే.. టోటల్ వరల్డ్ వైడ్‌గా దాదాపు 85కోట్లు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న బన్నీకి ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X