అల్లు అర్జున్ ఆర్య 2 పరిస్ధితి ఏమిటి? (ట్రేడ్ టాక్)
క్రిందటి వారం జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా అనే చిత్రం మాత్రమే రిలీజైంది. ఇక ఈ వారం ఆర్య 2 ఘనంగా విడుదలైంది. అయితే ఈ రెండు చిత్రాలు భాక్సా ఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. బి.వి.రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం టీవీ సీరియల్ కన్నా అధ్వానంగా ఉండి ప్రేక్షకులును, భక్తులను తీవ్రమైన నిరాశలో ముంచింది. ఇక ఆర్య-2 దగ్గరకు వస్తే కథ,కథనంలో క్లారిటీ మిస్సవటంతో కన్ఫూజై అభిమానులను సైతం అలరించలేకపోతోంది. దాంతో హాలీవుడ్ చిత్రం యుగాంతం 2012 హిట్ టాక్ కు ఢోకా లేకుండా కలెక్షన్స్ కురిపిస్తోంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఉన్నా కథ సరిగా లేకపోతే సీక్వెల్ అయినా కిల్ అయిపోతుందని ఆర్యను విమర్శిస్తున్నారు. ఇక అంతకు ముందు వారం రిలీజైన వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రం ఆ వారం దాటి రెండో వారానికే ధియోటర్స్ నుంచి ఎత్తేసారు. కుర్రాడుతో పాటే రిలీజైన ఒరిజనల్, పదహేరేళ్ళు చిత్రాలు ఆ దర్శక, నిర్మాతలకు తప్ప వేరే వారికి వాటి సంగతి పట్టలేదు.


Click it and Unblock the Notifications











