Deshamuduru Re Release Collections: థియేటర్లు ఖాళీ అన్నారు.. కానీ కలెక్షన్స్ మాత్రం మైండ్ బ్లాక్!
పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా దేశముదురు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2007లో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా దేశముదురు సినిమాను ప్రత్యేకంగా రీ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే...
కలెక్షన్స్ రావని అన్నారు: ఇటీవల కాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటున్నాయి. అయితే దేశముదురు సినిమాను 4K లో రీ రిలీజ్ లో విడుదల చేస్తున్నారు అనగానే పెద్దగా బజ్ అయితే కనిపించలేదు. అసలు ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అంతగా రాలేవు అని థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది.

ఎన్ని థియేటర్స్ అంటే: దేశముదురు సినిమాను మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా కర్ణాటక అలాగే ఇతర ముఖ్యమైన స్టేట్స్ లలో కొన్ని స్పెషల్ షోలు కూడా వేయడం జరిగింది. దాదాపు 130 థియేటర్స్ లలో దేశముదురు 4కె వెర్షన్ను రీ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మాస్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే అందుకుంది. ఏమాత్రం రెస్పాన్స్ రాలేదు అన్నవారికి బాక్సాఫీస్ కలెక్షన్స్ తోనే దేశముదురు సమాధానం చెప్పిందే.
నైజాం, ఆంధ్ర కలెక్షన్స్: బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. నైజాంలో 68 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. సీడెడ్ లో అయితే ఈ సినిమాకు ఏకంగా 18 లక్షల వచ్చాయి. ఇక ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే 60 లక్షల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశముదురు 4కె వెర్షన్ 1.46 కోట్ల గ్రాస్ అందుకుంది.

మిగతా రాష్ట్రాల్లో: ఇక కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా లో కూడా ఈ సినిమాను కొన్ని స్క్రీన్స్ లలోవిడుదల చేశారు. ఇక విడుదల చేసింది కొన్ని సెంటర్స్ లలో అయినా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. పుష్ప తర్వాత బన్నీకి మిగతా రాష్ట్రాలలో కూడా మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే ఇక ఆ బజ్ ద్వారానే ఈ సినిమా ఈ రూట్లో అయితే దాదాపు 4 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకోవడం విశేషం.
మొత్తంగా ఎంత వచ్చాయంటే: ఇక మొత్తంగా దేశముదురు రీ రిలీజ్ లో లేటెస్ట్ గా అందిన కలెక్షన్స్ ప్రకారం ఫస్ట్ డే రూ.1. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. అసలు సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అసలు ఏమాత్రం బజ్ లేదు అని అనవసరంగా విడుదల చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కానీ అల్లు అర్జున్ స్టామినా ఏమిటో మరోసారి ఈ మాస్ సినిమాతో అర్థమైంది.
టాప్ 5లో దేశముదురు: ఇక ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాల లిస్టులో అయితే దేశముదురు ఐదవ స్థానంలో నిలవడం విశేషం. ఖుషి మొదటి స్థానంలో 3.62 కోట్లు అందుకోగా.. జల్సా సినిమా 2.57 కోట్లను సొంతం చేసుకుంది. ఇక తర్వాత ఒక్కడు 1.90 కోట్లు, పోకిరి 1.52 కోట్లతో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో దేశముదురు మొదటి రోజు 1.46 కోట్లను అందుకొని టాప్ ఫైవ్ లిస్టులో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











