అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెస్ట్ యాక్టర్ గా టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిగా నేషనల్ అవార్డు అందుకున్న నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. మన వైపు పుష్ప సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఇక చివరిగా పుష్ప2 చిత్రంతోనూ మరొకసారి అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 350 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన పుష్ప 2 : ది రూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ కలెక్షన్లను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 1870 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనంగా మారింది. ఇండియాలోనే అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 2000 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. మూడో స్థానంలో ప్రభాస్ బాహుబలి 2 చిత్రం ఉండింది.

Allu Arjun Huge Remuneration for Atlee Movie

అయితే అల్లు అర్జున్ పుష్ప 2 కలెక్షన్ల తర్వాత ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. దాంతో ఆయన నుంచి రాబోతున్న చిత్రాలకు కూడా మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసారని తెలుస్తోంది. అల్లు అర్జున్ రాబోయే చిత్రాలు కూడా భారీ బడ్జెట్ లోనే ఉండడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బడ్జెట్ 600 కోట్లు అవుతుందంటూ అంచనా వేశారు.

అల్లు అర్జున్ సరసన నటించేందుకు హీరోయిన్లనూ అట్లీ ఎంపిక చేశారు అంటూ గుసగుసలు వినిపించాయి. భారీ తారాగణాన్ని కూడా ఎంపిక చేసే పనులు టీం నిమగ్నమైందట. ఈ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం భారీ స్కేల్లో రూపుదిద్దుకునేలా ప్లాన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా షాకింగ్ న్యూస్ గా మారింది. అట్లీ డైరెక్ట్ చేయబోతున్న సినిమాకు ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అంట అల్లు అర్జున్.

ఇండియాలో ఇప్పటివరకు అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నది రజనీకాంత్ మాత్రమేనని రికార్డులు చెబుతున్నాయి. జైలర్ చిత్రం అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ గా నిలవడంతో నిర్మాతలు 210 కోట్లు రజినీకి రెమ్యూనరేషన్ గా అందించారంట. ఇక తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ తన రాబోయే చిత్రానికి 175 కోట్లు తీసుకుంటున్నారంటూ ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే గనక ఇండియాలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసినట్లే అంటున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు కూడా అంత క్రేజ్ ఉండడంతోనే రెమ్యూనరేషన్ హైక్ చేశారని సమాచారం.

ఇక అల్లు అర్జున్ పుష్ప2 : దిరూల్ చిత్రానికి రెమ్యునరేషన్, ఇతర ఒప్పందాలు కలిపి రూ.300 కోట్ల వరకు అందుకున్నారని టాక్. ఇక అట్లీ చిత్రానికి ఏకంగా 175 కోట్లు కావడం విశేషం. మరోవైపు డైరెక్టర్ అట్లీ కూడా రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ అట్లీ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X