twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్సీస్ లెక్కల్లో ముందున్న బన్నీ.. ఆ ఇద్దరికీ ఎంత వ్యత్యాసమంటే?

    |

    బాక్సాఫీస్ లెక్కల్లో మన దగ్గర ఓ లెక్కా పత్రం ఉండదు. ఎవరి నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటారు. కొందరేమో ఫ్యాన్స్ సంతోషం కోసం వేసుకుంటారు.. మరికొందరు రికార్డుల కోసం వేసుకుంటారు. అంతేకానీ సరేైన లెక్కలు, ఎంత వసూల్లు చేశాయో కచ్చితంగా చెప్పడం మాత్రం కుదరదు. అయితే ఓవర్సీస్ గణాంకాలు మాత్రం అలా ఉండవు. అక్కడ తెగిన టికెట్లలో ఒక్క డాలర్ కూడా బయటకు పోదు. అన్నీ పక్కాగా ఉంటాయి.

    మారిన ట్రెండ్..

    మారిన ట్రెండ్..

    ఓవర్సీస్ లెక్కలు అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి కాబట్టే.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇక్కడి కలెక్షన్లు మనవారికి ఎంత ముఖ్యమో.. ఓవర్సీస్ లెక్కలు కూడా అంతే ప్రముఖంగా మారాయి. ఇక్కడి వసూళ్లకు తీసిపోని విధంగా విదేశాల్లోనూ కుమ్మేస్తున్నాయి. ఓవర్సీస్‌లో తేడా కొట్టిన సినిమాలను ఫ్లాపుల కిందే జమకడతారు. కనీసం మిలియన్ డాలర్లు వసూళ్లు చేయని సినిమాలను హిట్ ఖాతాలో పరిగణించడం లేదు.

    ఓవర్సీస్‌లో మహేష్ ప్రభంజనం..

    ఓవర్సీస్‌లో మహేష్ ప్రభంజనం..

    సౌత్‌లో మరే హీరోకు లేని అరుదైన రికార్డు మహేష్ సొంతం. దాదాపు పది చిత్రాలు మిలియన్ మార్క్‌ను రాబట్టి అందరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాడు. అయితే తాజాగా సంక్రాంతి బరిలోకి దిగిన మహేష్ బాబు ఈజీగా వన్ మిలియన్ మార్క్‌ను టచ్ చేశాడు. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లతో అవలీలగా ఆ ఫీట్‌ను అందుకున్నాడు.

    వెనకబడిన మహేష్ బాబు..

    వెనకబడిన మహేష్ బాబు..

    అయితే సరిలేరు కంటే ఒకరోజు వెనుక రిలీజ్ అయిన అల వైకుంఠపురములో కలెక్షన్లలో దూసుకుపోతోంది. సరిలేరు కంటే ఎక్కువగా వసూళ్ల రాబడుతూ.. ఓవర్సీస్ వద్ద సత్తా చాటుతోంది. నిలకడగా వసూళ్ల రాబడుతూ సరిలేరును బీట్ చేసింది. సరిలేరు కంటే ముందుగా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అల్లు అర్జున్ కెరీర్‌లో మొదటి సారి రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్న చిత్రంగా అల వైకుంఠపురములో సరికొత్త రికార్డును సృష్టించింది.

    ఎంత తేడా ఉందంటే..?

    ఎంత తేడా ఉందంటే..?

    ఈ రెండు చిత్రాల మధ్య ఓవర్సీస్ లెక్కల్లో ఎంత తేడా ఉందన్న విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అమెరికాలో సరిలేరు 1.88మిలియన్ల డాలర్లు (13.36కోట్లు), అల వైకుంఠపురములో 2.1మిలియన్ల డాలర్లు (14.92కోట్లు).. ఆస్ట్రేలియాలో సరిలేరు 3.3లక్షల డాలర్లు (1.66కోట్లు), అల వైకుంఠపురములో నాలుగు లక్షల డాలర్లు (1.99కోట్లు), యూకేలో సరిలేరు 82వేల యూరోలు (76 లక్షలు), అల వైకుంఠపురములో 91వేల యూరోలు (84లక్షలు) వసూళ్లు చేశాయని తెలిపాడు.

    English summary
    Allu Arjun Is At Top Than Mahesh Babu In Overseas Collections. Ala Vaikunthapurramuloo Collected two Million Dollars Faster Than Sarileru Neekevvaru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X