‘జులాయి’ యు.ఎస్ కలెక్షన్స్ పరిస్ధితి?
హైదరాబాద్: అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'జులాయి'. ఆగస్టు 9న విడుదల అయిన ఈ చిత్రం టాక్ డివైడ్ గా ఉన్నా కెలక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా యుఎస్ లో సైతం ఈ చిత్రం కలెక్షన్స్ లో ఓ రేంజిలో నమోదు చేస్తున్నట్లు ట్రేడ్ లో చెప్తన్నారు. అల్లు అర్జున్ కెరీర్ జులాయి... యుఎస్ కలెక్షన్స్ లో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసిందంటున్నారు. ఫస్ట్ వీకెండ్ లోనే US$ 5,00,000 ఈ చిత్రం ప్రీమియర్ షో లతో సహా కలెక్టు చేసింది.
ఇక ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఈ సినిమా దాదాపు 1600 స్క్రీన్ లపై విడుదల అయ్యింది. అలాగే ఈ సినిమా 'ప్రమోషనల్' సాంగ్ రూపంలో వేసిన ఎత్తుగడ వర్కవుటయ్యింది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఇలియానా హీరోయిన్ గా చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. పాటలుకు బయిట మంచి క్రేజ్ వచ్చింది.
'జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శెలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయి. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు కొందరు... అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి.


Click it and Unblock the Notifications











