నా పేరు సూర్య 3 డేస్ కలెక్షన్స్: మూడు రోజుల్లో కుమ్మేశాడు.. అక్కడ మాత్రం!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. బన్నీ ఈ చిత్రంలో వన్ మాన్ షో పెర్ఫామెన్స్ చేశాడు. దేశ భక్తి కథాంశంగా రూపొందిన ఈ చిత్రంలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు ఉన్నాయి. వక్కంతం వంశీ తొలిసారి దర్శకుడిగా మారి చేసిన చిత్రం ఇది. చిత్రానికి కాస్త డివైడ్ టాక్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ సత్తాతో బాక్స్ ఆఫీస్ వద్ద బలంగా నడుస్తోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించారు. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఆర్మీ మాన్‌గా బన్నీ విశ్వరూపం
ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. యాంగ్రీ మాన్ గా బన్నీ కనబరిచిన నటన అద్భుతం. గత చిత్రాలకంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరి కొత్తగా కనిపించాడు.

బలంగా సాగుతున్న బాక్స్ ఆఫీస్ జోరు
ఈ చిత్రానికి కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ప్రదర్శన చేస్తోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది అల్లు అర్జున్ మార్కెట్ స్టామినాకు నిదర్శనం అని అంటున్నారు.

అక్కడ అంతంత మాత్రమే
నా పేరు సూర్య చిత్రం లోకల్ గా విజయవంతంగా ప్రదర్శించబడుతూ మంచి వసూళ్లనే రాబడుతోంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి ఎదురుగాలి తప్పట్లేదు. మూడు రోజుల్లో ఈ చిత్రం కేవలం హాఫ్ మిలియన్ మార్క్ ని మాత్రమే అందుకోగలిగింది.

మండే ఎలా ఉండబోతోంది
నా పేరు సూర్య చిత్రానికి సోమవారం నుంచి అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం సోమవారం నుంచి కూడా ఇదేస్థాయిలో వసూళ్లు రాబడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











