Don't Miss!
- News
Udaipur murder: హంతకులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో లింక్, కరాచీలో 40 రోజులు శిక్షణ !
- Sports
Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..
- Automobiles
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Pushpa 2 Pre Release Bussiness: RRR కంటే హై రేంజ్ లో భారీ డీలింగ్స్.. కనివిని ఎరుగని రికార్డ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్‌ను అమాంతం గా పాన్ ఇండియా రేంజ్ కు పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే పుష్ప సెకండ్ పార్ట్ పైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా కూడా అంతకు మించిన విజయాన్ని అందుకుంటుంది అని ఒక పాజిటివ్ టాక్ అయితే మొదలయింది. ఇక నిర్మాతలు సెకండ్ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వీలైనంత ఎక్కువగా బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం RRR కంటే ఎక్కువ రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హిందీలోనే భారీగా..
పుష్ప: ది రైజ్‌తో అద్భుతమైన హిట్ కొట్టిన అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా తక్కువ రేటుకు హిందీలో విడుదలవ్వగా భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం హిందీలో ఈ సినిమాకు వంద కోట్ల నెట్ కలెక్షన్ రావడం విశేషం. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో ఒక్కసారిగా అందరికి అర్థం అయిపోయింది.

RRR సినిమా కంటే హై రేంజ్ లోనే..
ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ ఫినిష్ కాకముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సృష్టిస్తోంది. ఒక విధంగా RRR, KGF 2 విజయాలు కూడా పుష్ప 2పై అలాగే దాని వ్యాపారంతోనే హైప్‌ను పెంచుతున్నాయి. అలాగే RRR సినిమా కంటే హై రేంజ్ లోనే పుష్ప సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత పవర్ఫుల్ గా..
పుష్ప సంపాదించిన విస్తృత రీచ్ కు తగ్గట్టుగా రెండవ భాగం, పుష్ప 2 లాభదాయకమైన ప్రాజెక్ట్‌గా కనిపిస్తోంది. అంచనాలు ఆకాశాన్ని దాటడంతో పార్ట్ 2ని మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేయడానికి దర్శకుడు సుకుమార్ కష్టపడుతున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికి మళ్ళీ కొన్ని సన్నివేశాలను మరింత పవర్ఫుల్ తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

ఆ రూట్లో 300కోట్లు
ఇక పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ అందుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం పుష్ప డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విలువ 300 కోట్ల రూపాయల వరకు వెళ్లినట్లు సమాచారం.

700కోట్లు పక్కా?
ఇప్పటికే
కొన్ని
డీల్స్
కుదిరినట్లు
తెలుస్తోంది.
సౌత్
ఇండియన్
లాంగ్వేజ్
థియేట్రికల్
రైట్స్
రూ.200
కోట్లు.
హిందీ
భాషా
హక్కులు
200
కోట్ల
రూపాయలని
తెలుస్తోంది.
అన్నీ
కలిపితే,
పుష్ప
2
ఓవరాల్
రైట్స్
రూ.
700
కోట్లు
వసూలు
చేయడం
కాయమని
అంటున్నారు.
మరి
సినిమా
బాక్సాఫీస్
వద్ద
ఎలాంటి
వసూళ్లను
అందుకుంటుందో
చూడాలి.
.