Pushpa 2: అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్.. సుకుమార్ కూడా తగ్గట్లేదు.. ప్రభాస్ రేంజ్ లో?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు మొదట పాన్ ఇండియా రిలీజ్ అవసరమా అనే స్థాయిలో అనేక రకాల నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ అల్లు అర్జున్ తన స్టార్ రేంజ్ ఏమిటో మరోసారి నిరూపించాడు. ఇక సుకుమార్ మేకింగ్ విధానం కూడా నార్త్ ఆడియన్స్ కు క్లారిటీగా అర్థం అయింది. ఇక పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి పారితోషికాల విషయంలో హీరో దర్శకుడు భారీగానే లాభపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.

హిందీలో షాకింగ్ కలెక్షన్స్
పుష్ప సినిమాకు మొదట కాస్త నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికి కూడా ఆ తర్వాత ఒక్కసారిగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ డోస్ పెంచేసింది. కేవలం హిందీలోనే ఈ సినిమాకు వంద కోట్ల కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. హిందీలో పుష్ప సినిమాను విడుదల చేయడం కూడా దండగ అనే విధంగా కామెంట్స్ వచ్చాయి. పైగా చివరి క్షణం లోనే అల్లు అర్జున్ అక్కడ ప్రమోషన్స్ చేశాడు. అయినప్పటికీ అక్కడే ఎక్కువ విజయాన్ని అందుకోవడం విశేషం.

స్క్రిప్ట్ లో మార్పులు
ఇక ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో దర్శకుడు హీరో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. అసలైయితే ఫస్ట్ పార్ట్ పూర్తి అయినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ అందులో కొన్ని సన్నివేశాలు అంచనాలకు తగ్గట్టుగా లేవు అని దర్శకుడు మరొకసారి కొత్త స్క్రిప్ట్ తో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
పుష్ప 2 సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పారితోషికాలు మరింత పెరగనున్నాయి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ భారీగా విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఇప్పుడు సెకండ్ పార్ట్ కు మార్కెట్ వాల్యూ కూడా అంతకు మించి పెరిగింది. తప్పకుండా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్ల వరకూ ఉంటుందని టాక్ అయితే వస్తోంది.

సుక్కు రెమ్యునరేషన్ ఎంత?
ఇక ఈసారి పుష్ప సెకండ్ పార్ట్ కోసం దర్శకుడికి దాదాపు 65 కోట్ల వరకు పారితోషికం అందే అవకాశం ఉందట. ఫస్ట్ పార్ట్ కోసం అయితే సుకుమార్ పెద్దగా పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీంతో అతనికి దాదాపు 35 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.

బన్నీ 100కోట్ల డిమాండ్
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 1 కోసం 40 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. అతను కూడా మొదట పారితోషికం తీసుకోకుండా సినిమా సక్సెస్ అనంతరం వాటా తీసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అతను ఏకంగా 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ప్రభాస్ రేంజ్ లోనే అల్లు అర్జున్ కూడా పారితోషికం అందుకునే విధంగా ముందుకు సాగుతున్నట్లు టాక్. ఇక మొత్తంగా ఈ సినిమా స్టార్స్ టెక్నీషియన్ల రెమ్యునరేషన్స్ కోసమే దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











