twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa Day 1 collections అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డు దిశగా.. తొలి రోజు ఎంత వసూలు చేయవచ్చంటే?

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అభిమానులు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను మెప్పించడంలో సఫలమైంది. బన్నీ కెరీర్‌లో ఎప్పడూ లేని విధంగా పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా భారీగా రికార్డు థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఎంత రాబట్టవచ్చనే అంచనాలోకి వెళితే..

    పుష్పకు మంచి ఆక్యుపెన్సీ

    పుష్పకు మంచి ఆక్యుపెన్సీ

    పుష్ప సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. రష్మిక గ్లామర్, అనసూయ, సునీల్ రస్టిక్ లుక్, ఫాహద్ ఫాజిల్, పుష్ప స్నేహితుడిగా నటించిన కేశవ్ (జగదీష్) నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. దీంతో ఈ సినిమాకు తొలి రోజు మంచి థియేటర్‌లో మంచి ఆక్యుపెన్సీ లభించింది.

    3000లకు పైగా థియేటర్లలో

    3000లకు పైగా థియేటర్లలో

    అయితే ఫుష్ప సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలతో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. నైజాం, ఆంధ్రాలో కలిపి 1150 థియేటర్లలో రిలీజ్ అయింది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీలో కలిపి సుమారు 1200 థియేటర్లలో, ఓవర్సీస్లో 600 థియేటర్లకుపైగా రిలీజైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3000పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ

    తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ

    పుష్ప చిత్రం భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజవ్వడమే కాకుండా ఫుల్ అక్యుపెన్సీతో కనిపించాయి. నైజాంలోని ప్రతీ చోట సగటున 90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే ఆంధ్రాలో కూడా 80 నుంచి 85 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవర్సీస్‌లో భారీ స్పందన, ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయింది. దాంతో పుష్ప సినిమా తొలి రోజు వసూళ్లపై అంచనాలు భారీగా పెరిగాయి.

    కుమ్మేసిన అడ్వాన్స్ బుకింగ్

    కుమ్మేసిన అడ్వాన్స్ బుకింగ్

    పుష్ప తొలి ఆట నుంచి టాక్ భారీగా రావడంతో మధ్యాహ్నం ఆట నుంచి మిగితా ఆటల వరకు ఊహించని అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దాంతో అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇంతకు ముందు లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్ కనిపించింది. కేవలం నైజాంలోనే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 4 కోట్లు మొదటి రోజుకు వచ్చాయి. అయితే ఆంధ్రాలో మాత్రం అంతా ఆశాజనకంగా కనిపించపోవడం సినిమా యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది.

    పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్

    పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్

    ఫుష్ప సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 9 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7.5 కోట్లు, నెల్లూరులో రూ.4 కోట్లు నమోదైంది.

    ఓవరాల్‌గా ఏపీ, తెలంగాణలో కలిపి 101 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో 9 కోట్లు, హిందీలో 10 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 145 కోట్ల మేర బిజినెస్‌ను పుష్ప తన ఖాతాలో వేసుకొన్నది.

    పుష్ప లాభాల్లోకి రావాలంటే..

    పుష్ప లాభాల్లోకి రావాలంటే..

    పుష్ప చిత్రం సుమారు 145 కోట్ల బాక్సాఫీస్ రన్‌తో మొదలైంది. అయితే తొలి రోజు కలెక్షన్లు సానుకూలంగా ఉండటం చూస్తే ఫస్ట్ వీకెండ్ లోగా బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం అలా వైకుంఠపురంలో సినిమాను కలెక్షన్లను దాటేస్తుందా? లేదా అనేది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

     పుష్ప ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా

    పుష్ప ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా

    పుష్ప సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున సుమారు 30 కోట్ల రూపాయాలను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక కర్టాటకలో కూడా మంచి రెస్సాన్, తమిళనాడులో కూడా పాజిటివ్ టాక్ ఉంది. ఓవర్సీస్ కలెక్షన్లు కూడా భారీగా నమోదు కావడంతో ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లను 40 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

    English summary
    Allu Arjun's Pushpa Day 1 Expected collections Worldwide: Trade analyst predicts that, Pushpa will collect approx. 40 crores worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X