Pushpa Day 3 collections 200 కోట్ల మార్క్‌పై కన్నేసిన పుష్ప.. లాభాల్లోకి రావాలంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే మూడో రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది. మూడో రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..

తమిళనాడులో వసూళ్లు ఇలా..
తమిళనాడులో కూడా పుష్పకు మంది ఆదరణ చూరగొంటున్నది. పుష్ప చిత్రం కోలీవుడ్‌లో ఓ ఘనతను సాధించింది. మూడు రోజుల్లోనే 10 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంతకు ముందు అరుంధతి, ఈగ, బాహుబలి, స్పైడర్, బాహుబలి2, సాహో ఉన్నాయి. తాజాగా పుష్ప కూడా చేరడం ఈ సినిమా కంటెంట్ పవర్ చెప్పింది. కర్ణాటకలో రూ.7.20 కోట్లు రాబట్టింది.

కేరళలో కలెక్షన్లు..
పుష్ప చిత్రానికి ఇతర ప్రాంతాల్లో ఆదరణ దక్కినట్టే.. కేరళలో కూడా మల్లు అర్జున్‌కు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. కేరళలో రెండు రోజుల్లోనే 3.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు అరుదైన మార్క్‌ను చేరుకొన్నది. మూడో రోజుల్లోనే ఐదు కోట్ల మార్కులో చేరింది. మూడో రోజున 1.5 కోట్లు వసూలు చేసింది.

నైజాంలో బాక్సాఫీస్ రిపోర్టు
నైజాంలో పుష్ప చిత్రం ప్రేక్షకుల ఆదరణ కాకుండా భారీ వసూళ్లను రాబడుతున్నది. రెండో రోజు 7.40 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రోజులకే 18.84 కోట్లు రాబట్టింది. మూడో రోజున ఈ చిత్రం మరో 7.14 కోట్లు ఖాతాలో వేసింది. మొత్తంగా మూడు రోజుల్లో 25.98 నికరంగా రాబట్టింది. దాంతో అల్లు అర్జున్ స్టామినా బాక్సాఫీస్ తెలియజేస్తున్నది.

వైజాగ్‌లో మూడు రోజుల కలెక్షన్లు
ఇక వైజాగ్ సిటీలో పుష్ప చిత్రానికి భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఒకటో రోజున 41.31 లక్షలు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజున 28.66 లక్షలు, మూడో రోజున రూ.28.55 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షనతో ముందుకెళ్తున్నది. దాంతో చిత్రం కోటి రూపాయల క్లబ్‌కు చేరువైంది.

ఆంధ్రా, సీడెడ్‌లో ఎంతంటే?
పుష్ప చిత్రం సీడెడ్‌లో 2.58 కోట్లు, ఇక కృష్ణా జిల్లాలో మూడో రోజున 80.32 కోట్లు సాధించింది. ఉత్తరాంధ్రలో ఈ చిత్రం 1.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 85 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లక్షలు, గుంటూరులో 64 లక్షలు, నెల్లూరులో 42 లక్షలు రాబట్టింది. దాంతో మూడో రోజున 14.38 కోట్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో
పుష్ప చిత్రం ఒకటో రోజున తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్ల విషయానికి వస్తే.. ఒకటో రోజున 24.9 కోట్లు, రెండో రోజున 13.70 కోట్లు, మూడో రోజున 14.38 కోట్లు వసూలు చేసింది దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 52.98 కోట్లు నికరంగా, 78 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు.
ఇక ఉత్తరాదిలోని హిందీ వెర్షన్ మూడో రోజుల్లో పుష్ప చిత్రం 5.8 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1.8 కోట్లు, ఓవర్సీస్ విషయానికి వస్తే..ప్రీమియర్ల ద్వారా 543,383 డాలర్లు, ఒకటో రోజున 430,580 అమెరికన్ డాలర్లు, రెండో రోజున 390,151 డాలర్లు, 10.37 కోట్లకుపైగా షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల షేర్, 173 కోట్ల గ్రాస్ నమోదైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన 144 కోట్ల బిజినెస్ చేసింది. ఇంకా 44 కోట్లు సాధిస్తే.. లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











