Pushpa 10days Collections: పదో రోజూ పుష్పకు ఊహించని కలెక్షన్లు.. అన్ని కోట్లతో బన్నీ మరో రికార్డ్

బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఇప్పుడు 'పుష్ప' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సుకుమార్ దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ మూవీగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. మరి ఈ మూవీ పది రోజుల కలెక్షన్ల రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

‘పుష్ప'గా మారిపోయిన ఐకాన్ స్టార్

‘పుష్ప'గా మారిపోయిన ఐకాన్ స్టార్

'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ విలన్ పాత్రలను పోషించారు.

ప్రీ బిజినెస్‌తోనే రికార్డ్ కొట్టిన బన్నీ

ప్రీ బిజినెస్‌తోనే రికార్డ్ కొట్టిన బన్నీ

ఏపీ, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో బన్నీకి భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో 'పుష్ప' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగింది.

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'పుష్ప' మూవీకి ఏపీ, తెలంగాణలో 10వ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 1.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 71 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్‌లో రూ. 15 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.40 కోట్లు షేర్, రూ. 6.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

10 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

10 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

'పుష్ప'కు 10 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 33.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.11 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.58 కోట్లు, గుంటూరులో రూ. 4.60 కోట్లు, కృష్ణాలో రూ. 3.77 కోట్లు, నెల్లూరులో రూ. 2.78 కోట్లతో.. ఏపీ టీఎస్‌లో రూ. 76.45 కోట్లు షేర్, రూ. 118.33 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

10 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 76.45 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 9.65 కోట్లు, తమిళనాడులో రూ. 8.05 కోట్లు, కేరళలో రూ. 4.15 కోట్లు, హిందీలో రూ. 18.26 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.25 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 130.98 కోట్లు షేర్‌తో పాటు రూ. 229 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 130.98 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 15.02 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

యూఎస్‌లో పుష్పరాజ్ అరాచకం

యూఎస్‌లో పుష్పరాజ్ అరాచకం

బన్నీ నటించిన 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే 10 రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.40 కోట్లు రాబట్టింది. దీంతో పదవ రోజు ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. ఇందులో బాహుబలి 2 ముందుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X