Pushpa 12days Collections: బాగా తగ్గిన కలెక్షన్లు.. తొలిసారి అంత తక్కువ.. అన్ని కోట్లు వస్తేనే హిట్

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు అందరూ పాన్ ఇండియా స్టార్లు అవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు దేశ వ్యాప్తంగా సత్తా చాటడంతో పాటు మార్కెట్‌ను గణనీయంగా విస్థరించుకున్నారు. దీంతో ఇప్పుడు మరికొందరు హీరోలు వాళ్ల బాటలో పయణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'పుష్ప' అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. మరి ఈ మూవీ పన్నెండు రోజుల కలెక్షన్ల రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

పుష్పగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్పగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ రూపొందించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

బిజినెస్‌తోనూ రికార్డు కొట్టేసిన బన్నీ

బిజినెస్‌తోనూ రికార్డు కొట్టేసిన బన్నీ

అల్లు అర్జున్‌కు ఏపీ, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 121.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 12 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

12వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

12వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో 'పుష్ప' మూవీకి 12వ రోజు కలెక్షన్లు బాగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 69 లక్షలు షేర్, రూ. 1.18 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

12 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

12 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

12 రోజుల్లో 'పుష్ప'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 38.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.27 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.45 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.67 కోట్లు, గుంటూరులో రూ. 4.70 కోట్లు, కృష్ణాలో రూ. 3.86 కోట్లు, నెల్లూరులో రూ. 2.86 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 78.20 కోట్లు షేర్, రూ. 121.26 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

రెండు రాష్ట్రాల్లో'పుష్ప'కు రూ. 78.20 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 10.24 కోట్లు, తమిళనాడులో రూ. 8.43 కోట్లు, కేరళలో రూ. 4.63 కోట్లు, హిందీలో రూ. 20.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.14 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.60 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే రూ. 136.89 కోట్లు షేర్‌తో పాటు రూ. 240.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 136.89 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 9.11 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

రిలీజ్ తర్వాత తొలిసారి తక్కువగా

రిలీజ్ తర్వాత తొలిసారి తక్కువగా

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి ఆరంభం నుంచే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పదకొండు రోజుల పాటు కోటి రూపాయలకు పైగానే షేర్‌ను రాబట్టింది. కానీ, 12వ రోజు మాత్రం కేవలం రూ. 69 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో రిలీజ్ తర్వాత తొలిసారి కోటి మార్కును చేరలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X