Pushpa 13 days Collections: మరింత తగ్గిన పుష్ప వసూళ్లు.. 146 కోట్ల టార్గెట్.. 13 రోజుల్లో ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా 'బాహుబలి' మూవీ తర్వాత నుంచి మన వాళ్లంతా ఇతర భాషల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు దేశ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు మార్కెట్‌ను కూడా ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూ వచ్చాయి. అయితే, బుధవారం మాత్రం ఈ మూవీ వసూళ్లు తగ్గాయి. మరి ఈ సినిమా పదమూడు రోజుల కలెక్షన్లను పరిశీలిద్దాం పదండి!

పుష్ప రంగంలోకి దిగిన అల్లు అర్జున్

పుష్ప రంగంలోకి దిగిన అల్లు అర్జున్

యమ జోష్‌లో ఉన్న అల్లు అర్జున్‌ తాజాగా నటించిన చిత్రమే 'పుష్ప'. సుకుమార్ తీసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

బిజినెస్‌తోనూ రికార్డు కొట్టేసిన బన్నీ

బిజినెస్‌తోనూ రికార్డు కొట్టేసిన బన్నీ

ఏపీ, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 13 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో 'పుష్ప' మూవీకి 13వ రోజు కలెక్షన్లు మరింత పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 42 లక్షలు షేర్, రూ. 68 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

13 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

13 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

'పుష్ప'కు 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.31 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.48 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.69 కోట్లు, గుంటూరులో రూ. 4.73 కోట్లు, కృష్ణాలో రూ. 3.88 కోట్లు, నెల్లూరులో రూ. 2.88 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 78.62 కోట్లు షేర్, రూ. 121.68 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో 13 రోజుల్లో 'పుష్ప'కు రూ. 78.62 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 10.30 కోట్లు, తమిళనాడులో రూ. 8.47 కోట్లు, కేరళలో రూ. 4.65 కోట్లు, హిందీలో రూ. 21.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.68 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లోనే రూ. 138.72 కోట్లు షేర్‌తో పాటు రూ. 244 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 138.72 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 7.28 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X