Pushpa 15days Collections: 15వ రోజు దారుణంగా కలెక్షన్స్.. తెలుగులో నెంబర్ వన్ హీరోగా బన్నీ రికార్డు

బడా సినీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆరంభంలోనే విజయాలను అందుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు, గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాలో నటించాడు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా పోటెత్తుతున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ సినిమా 15 రోజుల కలెక్షన్లను పరిశీలిద్దాం పదండి!

పుష్పగా ఎంటర్ అయిన ఐకాన్ స్టార్

పుష్పగా ఎంటర్ అయిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తాజాగా నటించిన చిత్రమే 'పుష్ప'. సుకుమార్ తీసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన విషయం తెలిసిందే.

బిజినెస్‌తోనూ అల్లు అర్జున్ రికార్డు

బిజినెస్‌తోనూ అల్లు అర్జున్ రికార్డు

తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 151.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల లెక్క.

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

15వ రోజు రెండు రాష్ట్రాల్లో 'పుష్ప' మూవీకి కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. దీంతో నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఏపీ తెలంగాణలో కలిపి రూ. 22 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

15 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

15 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

'పుష్ప'కు 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.36 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.71 కోట్లు, గుంటూరులో రూ. 4.77 కోట్లు, కృష్ణాలో రూ. 3.92 కోట్లు, నెల్లూరులో రూ. 2.90 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 79.12 కోట్లు షేర్, రూ. 122.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో 15 రోజుల్లో 'పుష్ప'కు రూ. 79.12 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 10.40 కోట్లు, తమిళనాడులో రూ. 8.54 కోట్లు, కేరళలో రూ. 4.69 కోట్లు, హిందీలో రూ. 23.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.77 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే రూ. 140.97 కోట్లు షేర్‌తో పాటు రూ. 251 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 140.97 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 5.03 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

Recommended Video

Pushpa Movie : Sukumar బిగ్ హార్ట్ .వా ళ్ళందిరికి లక్ష | Allu Arjun | Filmibeat Telugu
తెలుగులో నెంబర్ వన్ హీరోగా బన్నీ

తెలుగులో నెంబర్ వన్ హీరోగా బన్నీ

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. దీంతో వరుసగా రెండు సంవత్సరాలు రూ. 250 కోట్లు అంతకంటే ఎక్కువ గ్రాస్‌ను అందుకున్న తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డులకెక్కాడు. అదే సమయంలో వరుసగా రెండేళ్లు ఎక్కువగా షేర్‌ను అందుకున్న హీరోగానూ బన్నీ ఘనతను అందుకుని సత్తా చాటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X