Pushpa 23 Days Collections: మళ్లీ పెరిగిన పుష్ప మూవీ కలెక్షన్స్.. అమెజాన్‌లో వచ్చినా భారీగానే!

పేరుకు మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితమే 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఇటీవలే 'పుష్ప' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందనను అందుకుంది.

ఫలితంగా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో పాటు సూపర్ డూపర్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ 'పుష్ప' మూవీ 23 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

పుష్పగా అల్లు అర్జున్ విశ్వరూపం

పుష్పగా అల్లు అర్జున్ విశ్వరూపం

ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇది సూపర్ హిట్ అయింది.

పుష్ప మూవీకి జరిగిన బిజినెస్ ఇదే

పుష్ప మూవీకి జరిగిన బిజినెస్ ఇదే

తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 231.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 23 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.23 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

23వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

23వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దీంతో ఓపెనింగ్ డేతో పాటు కొన్ని రోజులు రికార్డులు నమోదయ్యాయి. తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు శనివారం కొంతమేర పెరిగాయి. దీంతో 23వ రోజు ఏపీ తెలంగాణలో రూ. 12 లక్షలు వచ్చాయి.

23 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

23 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

'పుష్ప'కు 23 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 40.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.94 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.84 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.93 కోట్లు, గుంటూరులో రూ. 5.05 కోట్లు, కృష్ణాలో రూ. 4.19 కోట్లు, నెల్లూరులో రూ. 3.07 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 84.46 కోట్లు షేర్, రూ. 131.56 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో 'పుష్ప'కు రూ. 84.46 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.41 కోట్లు, తమిళనాడులో రూ. 10.67 కోట్లు, కేరళలో రూ. 5.38 కోట్లు, హిందీలో రూ. 36 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 23 రోజుల్లోనే రూ. 164.43 కోట్లు షేర్‌తో పాటు రూ. 310 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 164.43 కోట్లు వసూలు చేసింది. అంటే దీనికి రూ. 18.43 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

అమెజాన్‌లో వచ్చినా ఇంత మొత్తం

అమెజాన్‌లో వచ్చినా ఇంత మొత్తం

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' మూవీ రెండు రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. హిందీ మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇది ప్రదర్శన అవుతోంది. అయినప్పటికీ శనివారం అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.42 కోట్లు వసూలు చేసింది. దీంతో పుష్ప హవా తగ్గలేదని మరోసారి నిరూపణ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X