Pushpa 24 Days Collections: మరో రికార్డును అందుకున్న పుష్ప.. 24వ రోజు కూడా అన్ని కోట్ల ఏంటి సామీ!

కొన్నేళ్లుగా తెలుగు సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతూనే పోతోంది. దీంతో మన బడా హీరోలందరూ పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తున్నారు. అలా ఒక్కొక్కరుగా బాలీవుడ్‌పై దండయాత్ర చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' అనే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. పాన్ ఇండియా రేంజ్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.

దీంతో చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరూ ఓ లుక్కేయండి!

 ‘పుష్ప'గా అల్లు అర్జున్ అరాచకం

‘పుష్ప'గా అల్లు అర్జున్ అరాచకం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. ఇది భారీ విజయాన్ని అందుకుంది.

పుష్ప మూవీకి జరిగిన బిజినెస్ ఇదే

పుష్ప మూవీకి జరిగిన బిజినెస్ ఇదే

ఏపీ, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో ఐకాన్ స్టార్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగిందని సమాచారం.

24వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

24వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప' మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే, తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు శనివారం కొంతమేర పెరిగాయి. అలాగే, ఆదివారం కూడా మరింతగా పెరిగాయి. దీంతో 24వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 19 లక్షలు వచ్చాయి.

24 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

24 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

24 రోజుల్లో ‘పుష్ప'కు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 40.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.02 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.86 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.94 కోట్లు, గుంటూరులో రూ. 5.07 కోట్లు, కృష్ణాలో రూ. 4.21 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 84.65 కోట్లు షేర్, రూ. 132 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో 24 రోజుల్లో ‘పుష్ప'కు రూ. 84.65 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.45 కోట్లు, తమిళనాడులో రూ. 10.70 కోట్లు, కేరళలో రూ. 5.40కోట్లు, హిందీలో రూ. 37.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.33 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లోనే రూ. 166.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 314.50 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 166.20 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇది రూ. 20.20 కోట్లు లాభాలతో మరో రికార్డు కొట్టింది.

Recommended Video

Tollywood : Movies Ready To Release On OTT & Streaming Details | Filmibeat Telugu
24వ రోజు కూడా ఈ రేంజ్‌లో కొట్టి

24వ రోజు కూడా ఈ రేంజ్‌లో కొట్టి

క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప' మూవీ మూడు రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. అయినప్పటికీ శనివారం అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.42 కోట్లు వసూలు చేసింది. అదే రేంజ్‌ను కంటిన్యూ చేస్తూ ఆదివారం ఏకంగా రూ. 1.77 కోట్లు కలెక్ట్ చేసింది. 24వ రోజు కూడా ఈ రేంజ్‌లో రాబట్టి పుష్పరాజ్ హవా చూపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X