Pushpa 26 Days Collections: భారీగా పడిపోయిన పుష్ప కలెక్షన్స్.. 26 రోజుల్లో తొలిసారి ఇంత ఘోరంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'ఆర్య', 'ఆర్య 2' వంటి ఫీల్‌ గుడ్ మూవీలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా కోరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే సత్తా చాటుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 26 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

పుష్పగా అల్లు అర్జున్ దండయాత్ర

పుష్పగా అల్లు అర్జున్ దండయాత్ర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన చిత్రమే ‘పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

పుష్ప మూవీ థియేట్రికల్ బిజినెస్

పుష్ప మూవీ థియేట్రికల్ బిజినెస్

ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగిందని తెలిసింది.

26వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

26వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప'కు ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే, తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు మంగళవారం మరింత పడిపోయాయి. దీంతో 26వ రోజు తొలిసారా దారుణంగా ఏపీ తెలంగాణలో కలిపి రూ. 6 లక్షలే వచ్చాయి.

26 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

26 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

‘పుష్ప'కు 26 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 40.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.04 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.87 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.94 కోట్లు, గుంటూరులో రూ. 5.09 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 84.79 కోట్లు షేర్, రూ. 132.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ, తెలంగాణలో 26 రోజుల్లో ‘పుష్ప'కు రూ. 84.79 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.48 కోట్లు, తమిళనాడులో రూ. 11.17 కోట్లు, కేరళలో రూ. 5.44 కోట్లు, హిందీలో రూ. 38.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.40 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 26 రోజుల్లోనే రూ. 167.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 318.50 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ అయింది.

Recommended Video

Pushpa Collections : AP Govt Decision Effects Pushpa
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన ‘పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 26 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 167.85 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇది రూ. 21.85 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X