Pushpa 4 Weeks Collections: 146 కోట్ల టార్గెట్.. 3 వారాల్లోనే ఊహించని విధంగా.. లాభం ఎంతో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు అందరూ పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సత్తా చాటి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'పుష్ప'తో దేశ వ్యాప్తంగా స్టామినాను చూపించేందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే సత్తా చాటుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నాలుగు వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరూ ఓ లుక్కేయండి మరి!

పుష్పగా సత్తా చాటిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విజయం సాధించింది.

పుష్ప మూవీ థియేట్రికల్ బిజినెస్
అల్లు అర్జున్‌కు ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు వరకూ బిజినెస్ జరిగిందట.

28వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఐకాన్ స్టార్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'కు ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే, తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు గురువారం మరింత పడిపోయాయి. దీంతో 28వ రోజు దారుణంగా ఏపీ తెలంగాణలో కలిపి రూ. 3 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి.

28 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
'పుష్ప' 4 వారాలకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 40.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.06 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.87 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.94 కోట్లు, గుంటూరులో రూ. 5.10 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 84.86 కోట్లు షేర్, రూ. 132.37 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో 4 వారాలకు 'పుష్ప'కు రూ. 84.86 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.50 కోట్లు, తమిళనాడులో రూ. 11.23 కోట్లు, కేరళలో రూ. 5.46 కోట్లు, హిందీలో రూ. 39.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.43 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 4 వారాల్లో రూ. 168.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 321 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 168.75 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇది రూ. 22.75 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











