Pushpa 30 Days Collections: పండుగ రోజు పుష్ప కలెక్షన్లు డబుల్.. ఏకంగా అన్ని కోట్లతో మరో రికార్డు
చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయినా.. రెండేళ్ల క్రితం వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఈ సారి దేశ వ్యాప్తంగా తన సత్తాను నిరూపించుకోవాలని 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు. దీన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాంచి మాస్ కథతో తెరకెక్కించాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నెల రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇలా సంక్రాంతి పండుగ రోజు కూడా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ 30 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

పుష్పగా అల్లు అర్జున్ అరాచకం
అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది.

పుష్ప మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది.

30వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'కు ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే, తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు సంక్రాంతి పండుగ రోజు డబుల్ అయ్యాయి. దీంతో 30వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 12 లక్షలు వసూలు చేసి సత్తా చాటింది.

30 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
30 రోజులకు కలిపి 'పుష్ప'కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 40.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.09 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.88 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.94 కోట్లు, గుంటూరులో రూ. 5.12 కోట్లు, కృష్ణాలో రూ. 4.24 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 85.03 కోట్లు షేర్, రూ. 132.67 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
30 రోజులకు ఆంధ్రా, తెలంగాణలో 'పుష్ప'కు రూ. 85.03 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.56 కోట్లు, తమిళనాడులో రూ. 11.32 కోట్లు, కేరళలో రూ. 5.49 కోట్లు, హిందీలో రూ. 41.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.47 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా నెల రోజుల్లో రూ. 171.34 కోట్లు షేర్‌తో పాటు రూ. 327.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 30 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 171.34 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 25.34 కోట్లు లాభాలతో మరో రికార్డును నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











