Pushpa 33 Days Collections: ఓటీటీలో వచ్చినా తగ్గని పుష్ప హవా.. ఏకంగా అన్ని లక్షల వసూళ్లతో రికార్డు
కొంత కాలంగా తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తోంది. మన దగ్గర వచ్చే సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు స్టార్లు భారీ చిత్రాలతో సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'పుష్ప' మూవీతో బాలీవుడ్‌పై దండయాత్రకు బయలుదేరాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నెల రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ 33 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ లుక్కేయండి!

పుష్పగా అల్లు అర్జున్ విశ్వరూపం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది భారీ సక్సెస్‌ను అందుకుంది.

పుష్ప మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
ఐకాన్ స్టార్‌కు ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని టాక్.

33వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప'కు ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు ఈ మూవీ కలెక్షన్లు మరింతగా పడిపోతున్నాయి. దీంతో 33వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 3 లక్షలు మాత్రమే వచ్చింది.

33 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
33 రోజులకు 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 40.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.11 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.89 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.95 కోట్లు, గుంటూరులో రూ. 5.13 కోట్లు, కృష్ణాలో రూ. 4.26 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 85.21 కోట్లు షేర్, రూ. 132.98 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో 'పుష్ప'కు 33 రోజుల్లో రూ. 85.21 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.61 కోట్లు, తమిళనాడులో రూ. 11.43 కోట్లు, కేరళలో రూ. 5.52 కోట్లు, హిందీలో రూ. 42.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 33 రోజుల్లో రూ. 173.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 332 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 33 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 173.19 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 27.19 కోట్లు లాభాలతో మరో రికార్డును నమోదు చేసింది.

ఓటీటీలో వచ్చినా 30 లక్షలు కొట్టి
పుష్ప మూవీ జనవరి 7వ తేదీ నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, జనవరి 14 నుంచి హిందీలోనూ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అయినప్పటికీ అక్కడ మాత్రం భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మంగళవారం హిందీ వెర్షన్‌కు ఏకంగా రూ. 30 లక్షల షేర్ వచ్చింది. తద్వారా అల్లు అర్జున్ స్టామినా మరోసారి నిరూపణ అయింది.


Click it and Unblock the Notifications











