Pushpa 2Days Collections: రెండో రోజు పుష్ప సంచలనం.. పవన్ రికార్డు బద్దలు.. ఇదేం కొట్టుడు సామీ!
టాలీవుడ్‌లో కొంత మంది దర్శకులు, హీరోల కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఆర్య', 'ఆర్య2' వంటి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు 'పుష్ప' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా మాస్ కమర్షియల్ మూవీగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రెండు రోజుల కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలను చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే రికార్డు బద్దలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగింది.

రెండో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'పుష్ప' మూవీకి ఏపీ, తెలంగాణలో రెండో రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 7.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.25 కోట్లు, ఈస్ట్‌లో రూ. 76 లక్షలు, వెస్ట్‌లో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 77 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 13.70 కోట్లు షేర్, రూ. 20.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో ఎంత వచ్చిందంటే
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీంతో మిగిలిన భాషల్లోనూ దీనికి మంచి రెస్పాన్సే దక్కుతోంది. ఫలితంగా రెండో రోజు కర్నాటకలో రూ. 1.25 కోట్లు, తమిళనాడులో రూ. 1.68 కోట్లు, కేరళలో రూ. 34 లక్షలు, హిందీలో రూ. 1.66 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 44 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు వసూలు అయ్యాయి.

2 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
'పుష్ప'కు రెండు రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 18.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.05 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.02 కోట్లు, గుంటూరులో రూ. 2.83 కోట్లు, కృష్ణాలో రూ. 1.92 కోట్లు, నెల్లూరులో రూ. 1.53 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 38.60 కోట్లు షేర్, రూ. 56 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
రెండు రోజుల్లో 'పుష్ప' మూవీకి రూ. 38.60 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.90 కోట్లు, తమిళనాడులో రూ. 3.05 కోట్లు, కేరళలో రూ. 1.55 కోట్లు, హిందీలో రూ. 3.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.05 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 58.90 కోట్లు షేర్‌తో పాటు రూ. 94 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.90 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 87.10 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

నాన్ బాహుబలి రికార్డులు బద్దలు
మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకుని ఎన్నో ఘనతలను అందుకున్న 'పుష్ప'.. రెండో రోజు కూడా పలు రికార్డులను బ్రేక్ చేసింది. మరీ ముఖ్యంగా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.70 కోట్లు వసూలు చేయడంతో టాలీవుడ్‌లో రెండో స్థానానికి చేరింది. తద్వారా వకీల్ సాబ్ రూ. 10.74 కోట్ల రికార్డును బద్దలు కొట్టేసింది. ఈ జాబితాలో బాహుబలి 2 ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











