Pushpa Business: షాకిస్తోన్న పుష్ప బిజినెస్.. బాహుబలిని దాటేసి రికార్డు.. అన్ని కోట్లు వస్తేనే హిట్
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికి కారణం మన సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తం కావడంతో పాటు టాలీవుడ్ హీరోల స్టామినా కూడా అంతకంతకూ పెరుగుతూ ఉండడమే. అందుకే కొన్నేళ్ల గ్యాప్‌లోనే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు పట్టాలెక్కేశాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'పుష్ప' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. మరీ ఈ చిత్రం ఎంత వసూలు చేస్తే హిట్ అవుతుందో చూద్దాం పదండి!
Recommended Video

‘పుష్ప’గా మారిపోయిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

రెండు భాగాలు.. పుష్ప ద రైట్ అంటూ
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. దీనికి టైం దగ్గర పడడంతో ఇందుకోసం త్వరితగతిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు.

అన్నింటికీ భారీ రెస్పాన్స్... రికార్డులు
'పుష్ఫ' నుంచి కొద్ది రోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి కొన్ని పాటలను వదలగా వీటికి దేశ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక, తాజాగా వచ్చిన ట్రైలర్ అయితే యూట్యూబ్‌ను ఊపి పడేసింది.

భారీ స్థాయిలో బిజినెస్.. హాట్ కేకుల్లా
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీ మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయని తెలిసింది.

ఏపీ తెలంగాణలో పుష్ప బిజినెస్ ఇలా
'పుష్ప' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 36 కోట్లు, సీడెడ్‌లో రూ. 18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7 కోట్లు, గుంటూరులో రూ. 9 కోట్లు, కృష్ణాలో రూ. 7.50 కోట్లు, నెల్లూరులో రూ. 4 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 101.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది.

మిగిలిన భాషల్లో.. రెస్టాఫ్ ఇండియాలో
పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న 'పుష్ప' మూవీకి వేరే భాషల్లో కూడా భారీ రేటు వచ్చింది. దీంతో కన్నడ రైట్స్‌కు రూ. 9 కోట్లు, మలయాళం హక్కులకు రూ. 4 కోట్లు, తమిళం హక్కులకు రూ. 6 కోట్లు, హిందీ హక్కులకు రూ. 10 కోట్ల, రెస్టాఫ్ ఇండియా హక్కులకు రూ. 1.15 కోట్లకు, ఓవర్సీస్ హక్కులకు రూ. 13 కోట్లతో మొత్తంగా రూ. 144.90 కోట్లు వచ్చాయట.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంతొస్తే హిట్?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇంత వస్తేనే సినిమా హిట్ అయినట్లు లెక్క. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది బీట్ చేయడం అంత కష్టమేమీ కాదనే చెప్పాలి.

టాలీవుడ్‌లో నాలుగు.. బాహుబలి బ్రేక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రాల జాబితాలో 'పుష్ప' నాలుగో స్థానానికి చేరింది. తద్వారా 'బాహుబలి 1' రికార్డుతో పాటు 'స్పైడర్', 'అజ్ఞాతవాసి' రికార్డులను బ్రేక్ చేసింది. ఇక, దీని కంటే ముందు 'బాహుబలి 2', 'సాహో', 'సైరా: నరసింహారెడ్డి' మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











