Pushpa Total Collections: నాలుగు భాషల్లో హిట్‌.. తెలుగులో అన్ని కోట్ల నష్టం.. షాకిస్తోన్న లెక్కలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు మార్కెట్‌ను గణనీయంగా విస్థరించుకుని ఉత్తరాదిలోనూ పాగా వేసేశారు. దీంతో మరికొంత మంది కూడా అదే బాటలో పయనించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు.

ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందనను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కానీ, తెలుగు వెర్షన్‌కు మాత్రం నష్టాలే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ ముగింపు సమయానికి తెలుగు వెర్షన్ ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

‘పుష్ప'గా అల్లు అర్జున్ విశ్వరూపం

‘పుష్ప'గా అల్లు అర్జున్ విశ్వరూపం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే ‘పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది భారీ స్పందనతో హిట్‌గా నిలిచింది.

పుష్ప తెలుగు థియేట్రికల్ బిజినెస్

పుష్ప తెలుగు థియేట్రికల్ బిజినెస్

అల్లు అర్జున్‌కు ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘పుష్ప' తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు రెండు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 8 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 123.75 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

‘పుష్ప' మూవీ తెలుగు వెర్షన్‌కు రెండు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 39.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.13 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.89 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.95 కోట్లు, గుంటూరులో రూ. 5.13 కోట్లు, కృష్ణాలో రూ. 4.26 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 84.33 కోట్లు షేర్, రూ. 131.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ముగింపు సమయానికి ‘పుష్ప' తెలుగు వెర్షన్‌కు ఏపీ తెలంగాణలో రూ. 84.33 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 9.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.45 కోట్లు వచ్చాయి. ఫలితంగా మిగిలిన భాషలను పక్కన పెడితే తెలుగు వెర్షన్‌కు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా రూ. 110.08 కోట్లు షేర్‌తో పాటు రూ. 185 కోట్లు గ్రాస్‌‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంతంటే

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంతంటే

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప' మూవీ తెలుగు వెర్షన్‌కు మాత్రమే అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 123.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 124.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 110.08 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 14.42 కోట్లు నష్టాలను ఎదుర్కొందీ సినిమా.

 అలా జరగడమే నష్టాలకు కారణమా?

అలా జరగడమే నష్టాలకు కారణమా?

పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైన ‘పుష్ప' మూవీకి అన్ని చోట్లా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగు వెర్షన్ ప్రపంచమంతా హవాను చూపించింది. అయితే, సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు వెర్షన్‌ కలెక్షన్లపై ఇది తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపింది. అలాగే, టికెట్ రేట్లు కూడా దెబ్బకొట్టాయి.

Recommended Video

Pushpa Collections : AP Govt Decision Effects Pushpa
షేర్ పరంగా రికార్డులు కొట్టేసిందిగా

షేర్ పరంగా రికార్డులు కొట్టేసిందిగా

‘పుష్ప' మూవీ ముగింపు సమయానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా రూ. 110.08 కోట్లు వసూలు చేసింది. తద్వారా టాలీవుడ్‌లో ఎక్కువ షేర్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 84.33 కోట్లు షేర్ వచ్చింది. దీంతో ఈ లిస్టులో మాత్రం ఏడో స్థానంలో నిలిచి సత్తా చాటింది బన్నీ సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X