Pushpa Collections: టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా పుష్ప.. బాహుబలితో పాటు అన్నీ దాటేసి ఆల్‌టైం రికార్డ్
గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'అల.. వైకుంఠపురము' చిత్రంతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ జోష్‌తోనే ఆ వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను ప్రారంభించాడు. చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే కలెక్షన్లను కూడా భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఓ ఏరియాలో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘పుష్ప'గా వచ్చేసిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు.

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో విడుదలైంది.

పుష్పరాజ్ హవా... పాజిటివ్ టాక్
బన్నీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'పుష్ప' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. అలాగే, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‌తో పాటు రివ్యూలూ బాగా వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప దూకుడు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక వసూళ్లు వచ్చాయి. దీంతో మొదటి రోజు ఏకంగా ఈ చిత్రం రూ. 24.90 కోట్ల షేర్‌తో పాటు రూ. 35.50 కోట్ల గ్రాస్ వసూలు అయింది. దీంతో ఫస్ట్ డే ఎక్కువ రాబట్టిన చిత్రాల్లో పదో స్థానంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగానూ భారీ రేంజ్
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. కర్నాట, తమిళనాడు, కేరళతో పాటు ఉత్తరాదిలోనూ భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ హవాను చూపించింది. ఫలితంగా మొదటిరోజు రూ. 38.49 కోట్లు షేర్, రూ. 63 కోట్ల గ్రాస్ వచ్చింది.

నైజాంలో భారీ వసూళ్లు చేసింది
చాలా కాలం తర్వాత భారీ స్థాయిలో విడుదలైన 'పుష్ప' మూవీకి అన్ని చోట్ల కంటే నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. అక్కడ బన్నీకి ఎక్కువ మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే దీనికి మొదటి రోజు ఏకంగా రూ. 11.44 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దీంతో 'పుష్ప' టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. దీంతో చాలా రికార్డులు కనుమరుగైపోయాయి.

టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా పుష్ప
'పుష్ప'కు నైజాంలో మొదటి రోజు రూ. 11.44 కోట్లు షేర్ వచ్చింది. దీంతో ప్రభాస్ 'సాహో' పేరిట ఉన్న రూ. 9.41 కోట్ల రికార్డు బద్దలైపోయింది. ఇక, ఆ ప్రాంతంలో తొలి రోజు ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ఇవి టాప్ 2లో ఉండగా.. 'బాహుబలి 2' రూ. 8.90 కోట్లతో మూడు, 'వకీల్ సాబ్' రూ. 8.75 కోట్లతో నాలుగు, 'సరిలేరు' రూ. 8.67 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











