కేరళలో 1.17, 11.7 అల్లు అర్జున్ అంకెల గారడీ.. అల వైకుంఠపురంలో మరో రికార్డు!
స్టైలిష్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. బన్నీకి రికార్డు స్థాయి కలెక్షన్లను కురిపించింది. మలయాళ భాషలో కూడా మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రం తాజాగా మలయాళ భాషలో మరో రికార్డు సొంతం చేసుకొన్నది. అదేమిటంటే..

మలయాళంలో రికార్డు స్థాయిలో
అల వైకుంఠపురం చిత్రం మలయాళంలో అంగు వైకుంఠపురతు అనే పేరుతో రిలీజైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. మలయాళంలో ఈ చిత్రం రూ.1.17 కోట్లు సాధించింది. ఆ తర్వాత ఇటీవల ఆ చిత్రాన్ని సూర్య టెలివిజన్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. అయితే మలయాళ టెలివిజన్ చరిత్రలో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

రికార్డు టీఆర్పీ రేటింగ్
అంగు వైకుంఠపురతు అనే చిత్రాన్ని సూర్య టెలివిజన్‌లో టెలికాస్ట్ అవ్వడం, రికార్డు స్షాయి టీఆర్పీ సాధించడంపై మల్లూ అర్జున్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు 11.7 టీఆర్పీ రేటింగ్‌ను సాధించడం మలయాళంలో ఓ రికార్డు అని చెప్పుకొంటున్నారు. దీంతో మలయాళంలో అల్లు అర్జున్ క్రేజ్ మరోసారి రుజువైంది.

పుష్ప ఫస్ట్‌లుక్‌కు సూపర్
ఇక ఏప్రిల్ 8 తేదీన జన్మదినం జరుపుకొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. బర్త్ డే కానుకగా అభిమానులకు పుష్ప ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అనుహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video

అల వైకుంఠపురం క్లోజింగ్ కలెక్షన్లు
అల వైకుంఠపురంలో క్లోజింగ్ కలెక్షన్లు చూస్తే.. నైజాం, ఏపీలో కలిపి రూ.128.68 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం నైజాంలో రూ.44.3 కోట్లు, కర్ణాటక రూ.9.18 కోట్లు, కేరళలో రూ.1.17 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.44 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రూ.18.33 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.253.85 కోట్ల గ్రాస్, రూ.158.80 కోట్ల నికర లాభాలను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











