For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బన్ని 'జులాయి'రిలీజ్ థియేటర్ల రికార్డు

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రం ఈ నెల 9 న విడుదల కానుంది. ఈ చిత్రం మొత్తం 1600 థియేటర్లలో విడుదల అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇది భారీ రిలీజ్. ఒకే రోజు ఆంధ్రా,కేరళ,కర్ణాటక,తమిళనాడు లలో విడుదలకానుంది. కేరళలలో తప్ప అన్నిచోట్లా తెలుగులో విడుదల కానుంది. కేరళలో మాత్రం మళయాళం లోకి డబ్ అయ్యి విడుదల అవుతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మాస్ లోకి దూసుకు వెళ్లిపోయాయి.

  ఇక ఈ చిత్రం హైలెట్స్ విషయానికి వస్తే...రాజేంద్రఫ్రసాద్ పెరఫార్మెన్స్ అంటున్నారు. అలాగే సోనూసోద్ కీ రోల్ చేస్తూంటే బ్రహ్మానందం,అలీ,ఎమ్.ఎస్ నారాయణ,తణికెళ్ల భరిణి నవ్వించనున్నారు. ఇలియానా తన అందచందాలతో కవ్విస్తే,బన్ని తన స్టైలిష్ నటనతో అలరించనున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇప్పటివరకూ చేయని ఓ డిఫెరెంట్ పాత్రను చేస్తున్నారు. అడ్డదారిలో వెళ్లి ఎదగాలనుకునే వ్యక్తి కధ అని తెలుస్తోంది.

  కథ ప్రకారం...నాన్నకున్న బాకీలు, చెల్లాయికి కట్టిన రాఖీలు, ఒంటికున్న టీకాలు... ఇది కాదు చరిత్ర అని నమ్మే అల్లరి కుర్రాడతను. మాటలే కాదు, పద్ధతీ కాస్త తికమకగానే ఉంటుంది. జీవితంలో స్థిరపడిపోవాలంటే చాలా కష్టపడాలి. అదే... కాస్త అడ్డదారి వెతుక్కున్నామంటే క్షణాల్లో రాజులా వెలిగిపోవచ్చు. కాకపోతే కాస్త రిస్క్‌ చేయాలి. అది చేయడానికీ సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ సాహసం ఏమిటి? హాయిగా జులాయిగా బతికేసే అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే 'జులాయి' చూడాల్సిందే.

  అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు. సమర్పణ: డి.వి.వి.దానయ్య. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

  English summary
  Allu Arjun's forthcoming film "Julayi" will have a massive release in two languages Telugu and Malayalam (dubbed) in four states - AP, Kerala, Karnataka, and Tamil Nadu in 1600 theaters. The makers of the film are making arrangements for a grand release on August 8. Julayi, directed by Trivikram Srinivas, has Ileana playing Allu Arjun's love interest and music by Devi Sri Prasad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X