Pushpa Hindi 15 dyas collections ఉత్తరాదిలో దుమ్మరేపుతున్న పుష్ప.. బాక్సాఫీస్ జోరు మూములుగా లేదుగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబడుతున్నది. 15వ రోజున కూడా నార్త్ రీజియన్‌లో నిలకడగా కలెక్షన్లను నమోదు చేసింది. గత 15 రోజులు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

పుష్ప రెండో వారంలో రెండో శుక్రవారం 2.31 కోట్లు, శనివారం 3.75 కోట్లు, ఆదివారం 4.25 కోట్లు, సోమవారం 2.75 కోట్లు, మంగళవారం 2.50 కోట్లు, బుధవారం 2.40 కోట్లు, గురువారం 2.24 కోట్లు, శుక్రవారం 3.50 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 50.59 కోట్ల నికర వసూళ్లను సాధించింది.
గత రెండు వారాలుగా పుష్ప చిత్రం కలెక్షన్లు అనూహ్యంగా పుంజుకొన్నాయి. కరోనావైరస్ పరిస్థితులను అధిగమించి ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇక ఈ సినిమా 50 కోట్లను దాటడంతోపాటు శనివారం కూడా భారీ వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా మరో 4 కోట్ల వరకు బాక్సాఫీస్ ఖాతాలో వేసుకొనే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 60 కోట్లకు చేరువవుతుంది.
ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద పుష్ప వేగాన్ని చూస్తే భారీగా వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ చిత్రం 70 నుంచి 80 కోట్ల మధ్య కలెక్షన్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











