Pushpa Day 5 collections బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న పుష్ప.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అన్ని భాషల్లో దూకుడు ప్రదర్శిస్తున్నది. ఉత్తరాదిలో ఎలాంటి ప్రమోషన్ చేయకున్నా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం అన్ని ప్రతికూలతలను ఎదురించి కలెక్షన్ల సునామీతో ముందుకెళ్తున్నది. పుష్ప చిత్రం 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

మహారాష్ట్రలో 50శాతం అక్యుపెన్సీతోనే

మహారాష్ట్రలో 50శాతం అక్యుపెన్సీతోనే

మహారాష్ట్రలో సినిమాల ప్రదర్శనపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కోవిడ్, ఒమిక్రాన్ భయాందోళనల కారణంగా 50 శాతం అక్యుపెన్సీతో సినిమా థియేటర్లు రన్ అవుతున్నాయి. తొలి రోజున 3.11 కోట్లు, శనివారం 3.55 కోట్లు, ఆదివారం 18 కోట్లు, సోమవారం 4.25 కోట్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో 16.09 కోట్లు సాధించిన ఈ చిత్రం 5వ రోజున మరో 4 కోట్లు ఖాతాలో వేసుకొని 20 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఉత్తరాదిలో ఈ చిత్రం 25 కోట్ల మార్క్‌పై కన్నేసింది.

తమిళనాడులో బ్రేక్ ఈవెన్

తమిళనాడులో బ్రేక్ ఈవెన్

తమిళనాడులో కూడా పుష్ప సినిమా హంగామా సృష్టిస్తున్నది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ప్రవేశించింది. తమిళనాడులో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్లుగా నమోదైంది. అయితే కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ఆరు కోట్ల మార్కును అధిగమించింది. డిస్టిబ్యూటర్లకు ఏ రేంజ్ లాభాలను తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే.

అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్క్

అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్క్


అమెరికాలో కూడా పుష్ప చిత్రం అరుదైన 2 మిలియన్ల మార్క్‌ను అధిగమించడానికి సిద్ధమైంది. తొలివారాంతం తర్వాత కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో ముందుకెళ్తున్నది. అమెరికాలో ఐదు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారా 543,383 డాలర్లు, తొలి రోజున 430,872 డాలర్లు, రెండో రోజున 394,124 డాలర్లు, మూడో రోజున 257,362 డాలర్లు, నాలుగో రోజున 122,601 డాలర్లు, ఐదో రోజున 50,000 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో తొలి వారంలో 2 మిలియన్ల మార్కును చేరుకొనే అవకాశం ఉంది.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

తెలుగు సినిమాకు రాజధానిగా పేరున్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కూడా ఫుష్ప చిత్రం భారీగా వసూళ్లను రాబట్టింది. తొలి రోజున 41 లక్షలు, రెండో రోజున 28 లక్షలు, మూడో రోజున 28 లక్షలు, నాలుగో రోజున 12 లక్షలు, 5వ రోజున 8 లక్షలు రాబట్టింది. అయితే ఇటీవల కాలంలో ఏ హీరో సాధించని వసూళ్లను అల్లు అర్జున్ రాబట్టారు. పుష్ప చిత్రం 1.10 కోట్లు కేవలం నాలుగు రోజుల్లోనే వసూలు చేసింది. 2021లో వకీల్ సాబ్ చిత్రం 90 లక్షలు, అఖండ 69 లక్షలు, జాతిరత్నాలు 67 లక్షుల, ఉప్పెన 62 లక్షలు వసూలు చేసింది.

సీడెడ్‌లో సత్తా చాటిన స్టైలిష్ స్టార్

సీడెడ్‌లో సత్తా చాటిన స్టైలిష్ స్టార్


ఇక సీడెడ్‌లో అరుదైన రికార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకొన్నాడు. 4వ రోజుకే ఈ చిత్రం 10 కోట్ల వసూళ్లను సాధించింది. నైజాంలో ఈ సినిమా 32 కోట్ల షేర్ సాధించింది. ఐదో రోజున ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు

తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు


పుష్ప చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 5వ రోజు కలెక్షన్లు భారీగానే నమోదయ్యాయి. నైజాంలో ఈ చిత్రం 3 కోట్లు, సీడెడ్‌లో 80 లక్షలు, ఉత్తరాంధ్రలో 70 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 44 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 25 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణా జిల్లాలో 22 లక్షలు, నెల్లూరులో 26 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5వ రోజున 6 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?

పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 100 కోట్ల మార్కు, 168 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో నాలుగు రోజుల్లో 13 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం 5వ రోజు అదనంగా మరో 37 లక్షలను వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 203 కోట్లు రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X