Pushpa Day 6 collections..దారుణంగా పుష్ప వసూళ్లు.. ఆ ప్రాంతంలో భారీ నష్టాలు.. లాభాల్లోకి రావాలంటే?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం కలెక్షన్లు దయనీయంగా మారాయి. ఓవరాల్‌గా చూసుకొంటే ఈ సినిమా కలెక్షన్లు మిశ్రమ ఫలితాలను సాధిస్తున్నాయి. అయితే ఏపీలో టికెట్ రేట్ల వివాదం కొనసాగుతున్నప్పటికీ పుష్ప అరుదైన రికార్డులను క్రియేట్ చేస్తున్నది. అయితే కొన్ని చోట్ల భారీ నష్టాలను నమోదు చేసే అవకాశం స్పష్టం కనిపిస్తున్నది. అయితే కొన్ని ప్రతికూలతల మధ్య పుష్ప ఆరో రోజు ఎంత వసూలు చేసిందంటే..

ఉత్తరాదిలో కుమ్మేస్తున్న పుష్ప
పుష్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా ఏపీ, తెలంగాణతోపాటు పలు చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేసినట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో సెన్సార్ లేటుగా కావడం, ఏదో మొక్కబడిగా అల్లు అర్జున్ ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనడం జరిగింది. ఇక పుష్ప సినిమాకు స్పైడర్ మ్యాన్ రూపంలో భారీ దెబ్బ తగిలింది. పుష్ప రిలీజ్‌కు ఒకరోజు ముందు రిలీజైన కావడం, ప్రేక్షకులు భారీగా ఆదరించినప్పటికి స్పైడర్ మ్యాన్‌తో పోటీపడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది.

బాలీవుడ్‌లో బ్రేక్ ఈవెన్
ఉత్తరాదిలో పుష్ప ఆరు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. శుక్రవారం 3.11 కోట్లు, శనివారం 3.55 కోట్లు, ఆదివారం 5.18 కోట్లు, సోమవారం 4.25 కోట్లు, మంగళవారం 4.25 కోట్లు, బుధవారం సుమారు 3.5 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ చిత్రం ఉత్తరాదిలో రూ.23.5 కోట్ల వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. కేవలం ఆరు రోజుల్లోనే పుష్ప చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏపీలో దారుణంగా కలెక్షన్లు
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో పుష్ప వసూళ్లు దారుణంగా క్షీణించాయి. టిక్కెట్ల రేట్లు అతి తక్కువగా ఉండటం కారణంగా భారీ కలెక్షన్లను నమోదు చేయలేకపోయింది. అయినప్పటికీ గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో జోష్‌ను పెంచింది. ఈ చిత్రం 6 రోజుల్లో 100 కోట్లకుపైగా గ్రాస్, రూ.66 కోట్లకుపైగా షేర్‌ను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

146 కోట్లకు ఎంత వసూలు చేసిందంటే..
పుష్ప చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గత 6 రోజుల్లో వసూళ్లను ఇలా నమోదు చేసింది. తొలి రోజున ఈ చిత్రం 25 కోట్ల షేర్ సాధిస్తే.. రెండో రోజు 13.70 కోట్లు, మూడో రోజున 14.92 కోట్లు, నాలుగో రోజున 6.92 కోట్లు, ఐదో రోజున 3.87 కోట్లు, ఆరో రోజున సుమారుగా 3 కోట్లు రాబట్టింది. అయితే టికెట్ల రేట్లు పెంపుకు ప్రభుత్వం అనుమతించి ఉంటే పుష్ప సినిమా కలెక్షన్లు భారీగా, రికార్డు స్థాయిలో ఉండేవనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. అయితే ఏపీ, తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 146 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.

పుష్ప ఆరో రోజు కలెక్షన్లు
పుష్ప చిత్రం ఆరో రోజున తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల వారీగా వసూళ్లుగా ఇలా వసూలు చేసింది. నైజాంలో 90 లక్షలు, సీడెడ్‌లో 30 లక్షలు, ఉత్తరాంధ్రలో 25 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 15 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, కృష్ణా జిల్లాలో 10 లక్షలు, నెల్లూరులో 8 లక్షలు వసూలు చేసింది. దాంతో 2 కోట్ల మేర షేర్, 4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











