Pushpa Hindi 41 days Collections వీర లెవెల్లో అల్లు అర్జున్ కుమ్ముడు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప అని భాషల్లోను దుమ్మురేపింది. కంటెంట్ పరంగా, నటీనటులు పెర్ఫార్మెన్స్ పరంగా, కలెక్షన్ల పరంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. అయితే ఈ చిత్రం ఊహించని విధంగా హిందీ భాషల్లో ఇంకా భారీగా వసూళ్లను రాబట్టడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 41వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
పుష్ప చిత్రం బాలీవుడ్‌లో రిలీజ్ అవ్వడానికి ముందు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండేవి. థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ, అలాగే 83, స్పైడర్ మ్యాన్ సినిమాల నుంచి గట్టిపోటి ఎదురైంది. ఇలాంటి పోటీని, పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా భారీ వసూళ్లను రాబడుతున్నది. 41వ రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టడం హిందీ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పుష్ప చిత్రం తొలివారం 26.89 కోట్లు, రెండోవారం 20.20 కోట్లు, మూడో వారం 25.40 కోట్లు, నాలుగో వారం 11.79 కోట్లు, ఐదో వారం 7.30 కోట్లు, ఆరో వారం 5.55 కోట్లు వసూలు చేసింది.
తొలివారం
పుష్ప చిత్రం హిందీ వెర్షన్ ఆరోవారం కూడా థియేటర్లలో నడుస్తున్నది. 36వ రోజు 60 లక్షలు, 37వ రోజు 85 లక్షలు, 38 రోజు 1.4 కోట్లు, 39వ రోజు 60 లక్షలు, 40వ రోజు 55 లక్షలు, 41వ రోజు 1.55 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం హిందీ వెర్షన్ మొత్తంగా 115 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సుమారు 48 కోట్ల షేర్‌ను వసూలు చేసింది.
హిందీలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది సినిమాల విషయానికి వస్తే.. అగ్రస్థానంలో బాహబలి 2 709 కోట్లు, 2.0 చిత్రం 221 కోట్లు, సాహో 177 కోట్లు, బాహుబలి 165 కోట్లు, పుష్ప 155 కోట్లు, కేజీఎఫ్ 50 కోట్లు, కబాలి 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











