Pushpa 3 Weeks Collections: 146 కోట్ల టార్గెట్.. మూడు వారాల్లోనే ఊహించని కలెక్షన్లు.. లాభం ఎంతంటే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో పాటు సూపర్ డూపర్ హిట్ స్టేటస్‌ను అందుకుంది. దీంతో నిర్మాతలకు లాభాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన 'పుష్ప' మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

ఐకాన్ స్టార్ పుష్పగా మారిపోయాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్‌తో
ఏపీ తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 211.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 21 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.21 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

21వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దీంతో ఓపెనింగ్ డేతో పాటు కొన్ని రోజులు రికార్డులు నమోదయ్యాయి. అయితే, కొద్ది రోజులుగా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 21వ రోజు రెండు రాష్ట్రాల్లో కేవలం రూ. 11 లక్షలే వచ్చాయి.

21 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
'పుష్ప'కు 3 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 40.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.98 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.82 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.92 కోట్లు, గుంటూరులో రూ. 5.03 కోట్లు, కృష్ణాలో రూ. 4.17 కోట్లు, నెల్లూరులో రూ. 3.07 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 84.25 కోట్లు షేర్, రూ. 131.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ తెలంగాణలో 3 వారాల్లో 'పుష్ప'కు రూ. 84.25 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.33 కోట్లు, తమిళనాడులో రూ. 10.53 కోట్లు, కేరళలో రూ. 5.30 కోట్లు, హిందీలో రూ. 34.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.25 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 21 రోజుల్లోనే రూ. 161.92 కోట్లు షేర్‌తో పాటు రూ. 305.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 161.92 కోట్లు వసూలు చేసింది. అంటే దీనికి రూ. 15.92 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











