Pushpa 1 Week Collections: 146 కోట్ల టార్గెట్.. ఇంకెంత వస్తే హిట్ అంటే!
'ఆర్య', 'ఆర్య2' వంటి ఫీల్ గుడ్ సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పక్కా మాస్ కమర్షియల్ మూవీగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ సినిమా టార్గెట్‌ను చేరుకోడానికి వచ్చింది. అయితే, రెండు మూడు రోజులుగా కలెక్షన్లు క్రమంగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ మొదటి వారంలో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే టార్గెట్ చేరుకుంటుంది? పూర్తి కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Recommended Video

‘పుష్ప’గా మారిపోయిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్‌తో సుకుమార్ రూపొందించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌ను చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే బన్నీ రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగింది.

ఏడో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'పుష్ప' మూవీకి ఏపీ, తెలంగాణలో ఏడో రోజు కలెక్షన్లు తగ్గిపోయాయి. దీంతో నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. ఏడో రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.39 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
'పుష్ప'కు ఏడు రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 32.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.93 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.26 కోట్లు, గుంటూరులో రూ. 4.24 కోట్లు, కృష్ణాలో రూ. 3.44 కోట్లు, నెల్లూరులో రూ. 2.50 కోట్లతో.. ఏపీ టీఎస్‌లో రూ. 67.24 కోట్లు షేర్, రూ. 101.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
వారం రోజుల్లో 'పుష్ప' మూవీకి రూ. 67.24 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 8.81 కోట్లు, తమిళనాడులో రూ. 7.31 కోట్లు, కేరళలో రూ. 3.48 కోట్లు, హిందీలో రూ. 12.51 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.85 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 112.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 196 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 112.25 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 33.75 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

యూఎస్‌లో పుష్పరాజ్ అరాచకం
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దీనికి ఓవర్సీస్‌లో ఒకింత ఎక్కువ స్పందన వస్తోంది. ఫలితంగా ఈ మూవీ వారం రోజుల్లోనే రెండు మిలియన్ డాలర్లను సంపాదించింది. తద్వారా ఈ ఏడాది అక్కడ ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా ఇది మరో రికార్డును కూడా అందుకుంది.


Click it and Unblock the Notifications











