Pushpa 7Weeks Collections: 146 కోట్ల టార్గెట్.. 7 వారాల్లో ఊహించని విధంగా.. ఏకంగా అన్ని కోట్ల లాభం
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీ స్టామినా అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. దీనికి కారణం మన పరిశ్రమ నుంచి వచ్చే చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వస్తుండడమే. దీంతో ఇప్పటి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్‌లో తమ హవాను చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే బహు భాషా చిత్రాలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం 'పుష్ప' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందనను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ ఏడు వారాల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘పుష్ప'గా అల్లు అర్జున్ విశ్వరూపం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది భారీ విజయాన్ని అందుకుంది.

పుష్ప మూవీ థియేట్రికల్ బిజినెస్
ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో అల్లు అర్జున్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు వరకూ బిజినెస్ అయింది.

ఓటీటీ రిలీజ్.. తెలుగు రన్ కంప్లీట్
పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'పుష్ప'కు తెలుగు రాష్ట్రాల్లో ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో చాలా ఏరియాల్లో ఈ సినిమా రన్ కంప్లీట్ అయింది. కొన్ని కేంద్రాల్లో యాభై రోజులు ఆడుతుంది.

7 వారాలకూ తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'పుష్ప' మూవీకి 7 వారాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 40.74 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.13 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.89 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.95 కోట్లు, గుంటూరులో రూ. 5.13 కోట్లు, కృష్ణాలో రూ. 4.26 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 85.35 కోట్లు షేర్, రూ. 133.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
7 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో 'పుష్ప'కు రూ. 85.35 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.62 కోట్లు, తమిళనాడులో రూ. 11.45 కోట్లు, కేరళలో రూ. 5.52 కోట్లు, హిందీలో రూ. 42.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 49 రోజుల్లో రూ. 181.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 350.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 7 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 181.00 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 35 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











