Pushpa 8days Collections: 8వ రోజు పుష్పకు ఊహించని కలెక్షన్స్.. అన్ని కోట్లతో బన్నీ మరో రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా కొంత కాలంగా పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ధైర్యంతోనే బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. పక్కా మాస్ కమర్షియల్ మూవీగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. మొన్నటి వరకూ తగ్గిన కలెక్షన్లు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. మరి ఈ మూవీ పూర్తి కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి.

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చేసిన బన్నీ

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చేసిన బన్నీ

అల్లు అర్జున్‌ - సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేశారు. ఇది డిసెంబర్ 17న విడుదలైంది.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే బన్నీ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే బన్నీ రికార్డ్

అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో 'పుష్ప' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది.

8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'పుష్ప' మూవీకి ఏపీ, తెలంగాణలో 8వ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 1.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. 8వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.38 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

8 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

'పుష్ప'కు 8 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 33.99 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.20 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.03 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.34 కోట్లు, గుంటూరులో రూ. 4.34 కోట్లు, కృష్ణాలో రూ. 3.51 కోట్లు, నెల్లూరులో రూ. 2.56 కోట్లతో.. ఏపీ టీఎస్‌లో రూ. 69.62 కోట్లు షేర్, రూ. 105.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

8 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 69.62 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 9.05 కోట్లు, తమిళనాడులో రూ. 7.56 కోట్లు, కేరళలో రూ. 3.60 కోట్లు, హిందీలో రూ. 14.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.09 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.05 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ. 117.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 205 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 117.12 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 28.88 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

యూఎస్‌లో పుష్పరాజ్ అరాచకం

యూఎస్‌లో పుష్పరాజ్ అరాచకం

అల్లు అర్జున్ 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు గ్రాస్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా రెండుసార్లు 200 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని బన్నీ రికార్డు సాధించాడు. అలాగే, 8వ రోజు ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో పుష్ప పదో స్థానానికి చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X