Pushpa Collections: రిలీజ్ రోజే చరిత్ర సృష్టించిన పుష్ప.. ఇండియాలోనే తొలి చిత్రంగా రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని మాత్రం కొంత కాలంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్నాయి. అలాంటి భారీ చిత్రాల్లో 'పుష్ప' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా రికార్డు స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంది. అలా అలా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకుంది. ఇక, ఈరోజే 'పుష్ప ద రైజ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఆరంభంలోనే అదిరిపోయే రికార్డును అందుకుంది. తద్వారా ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప’గా వచ్చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలను చేశారు.

బిజినెస్‌తో పాటు థియేటర్లు కేకలా
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో విడుదలైంది.

అన్ని చోట్లా అదే మాట వినిపడేలా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అక్కడ మాత్రమే ఒకరోజు ముందు
భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కడంతో అన్ని చోట్లా భారీ స్థాయిలో విడుదలైంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మొత్తంలో ఇది దాదాపు 600లకు పైగా లొకేషన్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందులో ఒక్క అమెరికాలోనే దాదాపు 500 స్క్రీన్లలో ఇది విడుదలైంది. మన కంటే ముందే అక్కడ ప్రీమియర్స్ కూడా పడ్డాయి.

రిలీజ్ రోజే చరిత్ర సృష్టించిందిగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే యూఎస్‌లో 'పుష్ప' మూవీని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఎక్కువ లొకేషన్స్‌లో ప్రీమియర్స్ కూడా వేశారు. దీంతో ఈ సినిమాకు ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే 411k డాలర్లు వచ్చాయి. దీంతో అప్పుడే బన్నీ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది.

ఇండియాలోనే తొలి చిత్రంగా రికార్డ్
'పుష్ప' ప్రీమియర్ షో ద్వారానే 411k డాలర్లు గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో 2021 సంవత్సరంలో ప్రీమియర్స్ ద్వారా ఎక్కువ గ్రాస్‌ను రాబట్టిన ఇండియన్ సినిమాగా ఇది చరిత్రను సృష్టించింది. తద్వారా రజినీకాంత్ అన్నత్తే (410k డాలర్లు) రికార్డును అధిగమించింది. ఓపెనింగ్ డేన కూడా ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.
Recommended Video

భారీ ఓపెనింగ్స్ దిశగా పుష్పరాజ్
భారీ స్థాయిలో విడుదలైన 'పుష్ప' మూవీకి అన్నీ అనుకూలంగా మారాయి. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటుతో పాటు తెలంగాణలో ఐదు షోలకు అనుమతి లభించింది. దీనికితోడు రెస్టాఫ్ ఇండియాలో సైతం ఇది భారీగా విడుదలైంది. దీంతో ఈ సినిమాకు మొదటి రోజున రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











