twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సత్యమూర్తి’ కలెక్షన్స్ 3 రోజుల షేర్

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' మొన్న గురువారం( ఏప్రిల్ 9న)ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న దాన్ని బట్టి గురు,శుక్ర,శనివారాల కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి. నిన్నటి(ఆదివారం)కు సంభదించిన ట్రేడ్ రిపోర్టు తెలియాల్సి ఉంది.

    మొత్రం 3 రోజుల షేర్:

    నైజాం -6.16 కోట్లు

    సీడెడ్ -2.93 కోట్లు

    నెల్లూరు -62 లక్షలు

    గుంటూరు -1.67 కోట్లు

    కృష్ణా-1.12 కోట్లు

    పశ్చిమ గోదావరి -1.13 కోట్లు

    తూర్పు గోదావరి-1.33 కోట్లు

    ఉత్తరాంధ్ర -1.65 కోట్లు

    మొత్తం... 16.61 కోట్లు షేర్ వచ్చింది.. ఇది గ్రాస్ కాదు..అలాగే..ఇందులో ఓవర్ సీస్, ఇండియాలోని మిగతా ప్రాంతాలు కలపలేదు.కేవలం..తెలుగు రెండు రాష్టాలలోని ప్రాంతాల కలెక్షన్స్ మాత్రమే.

    Allu Arjun's S/o Satyamurthy 3 Days Shares

    మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ లు , ఎ సెంటర్లలలో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. అయితే బి,సి సెంటర్లలలో మాత్రం డ్రాప్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే నిర్మాతలు మాత్రం తమ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే... 33.5 కోట్లు వసూలు చేసిందని అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేయటం గమనార్హం.

    అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

    Allu Arjun's S/o Satyamurthy 3 Days Shares

    చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.

    త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్‌లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్‌ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్‌ని తీసుకొచ్చాడని చెబుతున్నారు.

    English summary
    Allu Arjun starrer S/o Satyamurthy has collected nearly 16.6 crores share in two Telugu states in 3 Days .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X