బన్నీ 'సన్నాఫ్ సత్యమూర్తి' ...ఆడియో విడుదల తేదీ

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ హీరోయిన్స్. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా ఆడియో ..మార్చి 8న విడుదల అవుతోందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు చెస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దేవి , త్రివిక్రమ్,అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ‘జులాయి' ఆడియో పెద్ద హిట్టయ్యింది. అల్లు అర్జున్ - దేవి శ్రీ, త్రివిక్రమ్, దేవి శ్రీలది కూడా హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ఆడియోపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది.

Allu arjun's S/O Satyamurthy’s audio on March 8th ?

త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X