'సన్నాఫ్ సత్యమూర్తి' బెనిఫిట్ షో టెక్కెట్ వివరాలు
హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు వేయనున్నారు. హైదరాబాద్ ...కుకుట్ పల్లిలోని..భ్రమరాంబ ధియోటర్ లో ఈ చిత్రం బెనిఫిట్ షో వేస్తున్నారు. టిక్కెట్లు కావాల్సిన వారు సంప్రదించాల్సిన నెంబర్లు 9985433833, 9248004376, 8142249125. బాల్కనీకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విశేషాలు...
'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్ ఆనంద్ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్ ఆనంద్.
తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు త్రివిక్రమ్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'.

చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు త్రివిక్రమ్. బన్నీ స్త్టెల్, నటన అందరికీ నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం శ్రోతలను అలరిస్తోంది''అన్నారు.
అల్లు అర్జున్ హీరో. సమంత, నిత్య మేనన్, ఆదా శర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అని అన్నారు.


Click it and Unblock the Notifications











