Just In
- 7 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 7 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 8 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 9 hrs ago
బ్లాక్లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘S/O సత్యమూర్తి’ టార్గెట్ రూ. 55-60 కోట్లు
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం' 2014లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలించింది. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 58 కోట్ల షేర్ సాధించి మంచి లాభాలను మిగిల్చింది. ఈ సంవత్సరం కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మ్యాజిక్ క్రియేట్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ. 55 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఈ రైట్స్ అమ్మడం ద్వారా నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయని అంటున్నారు. సినిమాను కొన్న బయ్యర్లు కూడా లాభాల బాట పట్టాలంటే చిత్రం 60 కోట్లు వసూలు చేయాల్సిందే.

అల్లు అర్జున్ నటించడంతో పాటు, త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫ్యామిలీ ప్రేక్షకులు, యూత్ మెచ్చే అంశాలు మేళవించి సినిమా తీస్తాడు. ఆ నమ్మకంతోనే బయ్యర్లు సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసారు.
ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మినహ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఏప్రిల్ 2న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.