అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్.. సందీప్ రెడ్డి సినిమాకు అంత ఇస్తున్నారా?
ఇటీవల కాలంలో ఫ్యాన్ ఇండియా హీరోలకు పారితోషికాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో వందల కోట్లు ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇక అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా అమంతంగా పెరిగిపోతున్నట్లుగా చాలా రోజులుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే సినిమాకు కూడా అల్లు అర్జున్ నెంబర్ మరింతగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ప్రభాస్ కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఆ వివరాలలోకి వెళితే..

వెయ్యి కోట్ల బిజినెస్
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ తో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

అదే టార్గెట్
ఇక సినిమా సక్సెస్ అయితే మాత్రం అల్లు అర్జున్ రేంజ్ మరో స్థాయికి వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు. మార్కెట్ పరంగా అయితే ఆ సినిమా తప్పకుండా 1000 కోట్లు దాటాలి అని అల్లు అర్జున్ అందరికంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని డీల్స్ కూడా చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు కూడా అదే టార్గెట్ తో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది
ఇక అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా అంతకుమించి అనేలా ఉండాలి అని అనుకుంటున్నాడు. చర్చల్లో కొంతమంది దర్శకులు ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ సందీప్ రెడ్డి కథను ఫైనల్ అయితే చేశాడు. అతను ఎనిమల్ సినిమాను ఫినిష్ చేసిన తర్వాత బన్నీ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివరలో మొదలయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్ రేంజ్ లో రెమ్యునరేషన్
అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ నిర్మించబోయే ఆ ప్రాజెక్టు కోసం బన్నీ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా ప్రభాస్ రేంజ్ లోనే అల్లు అర్జున్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వంద కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు అని ఒక టాక్ ఉంది. 150 కోట్లు కూడా అన్నారు కానీ ఇంకా విషయంలో సరైన క్లారిటీ అయితే రాలేదు.

నిజంగా అంత ఇస్తున్నారా?
ఇక ప్రభాస్ ఇప్పటివరకు అయితే 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ కూడా 120 కోట్ల వరకు డిమాండ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఆ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ బన్నీకి 120 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











